కరోనా మహమ్మారి దాదాపు అందరు స్టార్ హీరోల కెరీర్లోనే అనుకోని గ్యాప్ తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదు. రాజకీయాల వల్ల పదేళ్లు గ్యాప్ తీసుకుని.. ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో పలకరించిన ఆయన.. ఆ తర్వాత రెండున్నరేళ్లకు కానీ కొత్త సినిమాతో రాలేకపోయారు. ఇంత విరామం తీసుకుని ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే అది ఊహించని పరాభవాన్ని మిగిల్చింది. చిరు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడం మామూలు షాక్ కాదు. ఈ చిత్రం చిరును, ఆయన అభిమానులను ఎంత నిరాశకు గురి చేసి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంకో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం, దానితో అందరినీ మెప్పించడం చాలా అవసరం. చిరు చేతుల్లో ఉన్న వాటిలో కొంచెం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నది ‘గాడ్ ఫాదర్’ మూవీనే.
ఈ చిత్ర షూటింగ్ కూడా చకచకా నడుస్తోంది. ఇప్పటికే 60 శాతం దాకా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. భార్య సురేఖతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చిరు.. తిరిగి హైదరాబాద్ రాగానే ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణను కొనసాగించనున్నాడు. ఇంకో రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసి ఆగస్టులోనే ‘గాడ్ ఫాదర్’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఆగస్టు 15కు ముందు వచ్చే వీకెండ్‌కు చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ నెల ద్వితీయార్ధంలోనే ‘గాడ్ ఫాదర్’ రిలీజయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటుగా చిరు.. బాబీ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో దానికి గ్యాప్ ఇచ్చి పూర్తిగా తన ఫోకస్ ‘గాడ్ ఫాదర్’ మీదే పెట్టనున్నారట. ఆ తర్వాత బాబీ సినిమాను పూర్తి చేసి దసరాకు లేదా ఏడాది చివర్లో రిలీజ్ చేసే యోచనలో చిరు ఉన్నట్లు సమాచారం. ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక క్యామియో రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2022 6:16 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…