Movie News

మేజర్ VS పృథ్విరాజ్ – గెలుపెవరిది

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అనిపించే ప్యాన్ ఇండియా మూవీ రాలేదు. ఈ నెల సర్కారు వారి పాట, ఎఫ్3లతో పాటు మరో నాలుగు చిన్న సినిమాలున్నాయి కానీ ఇవన్నీ కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే పరిమితమైనవి. జూన్ నుంచి మళ్ళీ గ్రాండియర్ల సందడి మొదలుకానుంది. జూన్ 3న జరగబోయే బాక్సాఫీస్ క్లాష్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఒకటి అడవి శేష్ మేజర్ కాగా రెండోది అక్షయ్ కుమార్ యుద్ధవీరుడిగా నటించిన పృథ్విరాజ్. రెండూ అయిదు భాషల్లో వస్తున్నాయి.

కాకతాళీయంగానో లేక అనుకుని ప్లాన్ చేసుకున్నారో ఏమో కానీ రెండు ట్రైలర్లూ నిన్నే విడుదలయ్యాయి. మేజర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కి ముంబై టెర్రరిస్టు అటాక్ నేపధ్యంగా తీసుకుని మహేష్ బాబు సోనీ సంస్థలు భాగస్వాములుగా సంయుక్తంగా నిర్మించాయి. ప్రమోషన్ గట్రా చూస్తుంటే కంటెంట్ మీద టీమ్ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ వాటిలో లేని క్వాలిటీ ప్రెజెంటేషన్ ఇందులో కనిపిస్తోంది.

ఇక పృథ్విరాజ్ విషయానికి వస్తే ఇది కూడా చరిత్రలో నిలిచిపోయిన నిజజీవిత కథే. యష్ రాజ్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంజయ్ దత్, సోనూ సూద్, మానుషీ చిల్లర్ ఇలా క్యాస్టింగ్ కూడా గట్టిగా సెట్ చేసుకున్నారు. హిందూ సెంటిమెంట్ ని దట్టంగా వాడేశారు. ఒకరకంగా ఇది కూడా బయోపిక్కే. కథాకాలానికి సంబంధించి రెండు పూర్తి విరుద్ధమైనవే అయినప్పటికీ మెయిన్ పాయింట్ మాత్రం శత్రువులతో యుద్ధం చేయడం. మరి గెలుపు ఎవరిదో చూడాలి

This post was last modified on May 10, 2022 6:16 pm

Share

Recent Posts

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

27 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

1 hour ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

6 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

7 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

9 hours ago