కొడుకు మీద ప్రేమతో కొందరు తండ్రులు నిర్మాతగా మారి నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా కొడుకుని హీరోగా నిలబెట్టాలని కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతల్లో ఎమ్మెస్ రాజు ఒకరు. నిజానికి ఒకప్పుడు ఎమ్మెస్ రాజు పట్టిందల్లా బంగారమే. నిర్మాతగా కొన్ని నష్టాలు చూసినా ఎక్కువ శాతం సక్సెస్ అందుకున్నారు. ఒక టైంలో ఎమ్మెస్ రాజు నిర్మాణంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకునే హీరోలెందరో. అయితే ఇప్పుడు కాలంతో పాటు ఆయన చరిష్మా కూడా మారిపోయింది. వరుసగా ఫ్లాపులు అందుకొని ఫైనల్ గా డైరెక్టర్ కం నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
కొన్నాళ్ళ క్రితం ఎమ్మెస్ రాజు దర్శకుడిగా మారి కొడుకు సుమంత్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘తునీగా తునీగా’ అనే సినిమా తీశాడు. దిల్ రాజుతో కలిసి ఆ సినిమాను స్వయంగా నిర్మించారు కూడా. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అప్పటి నుండి కొడుకుతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ డైరెక్టర్ కం నిర్మాతగా కొనసాగుతున్నాడు రాజు.
ఆ మధ్య ‘డర్టీ హరి’ అంటూ ఓ అడల్ట్ కంటెంట్ సినిమా తీశాడు రాజు. ఒకప్పుడు హనీ బాబుగా ఎంతో గౌరవం తెచ్చుకున్న రాజు గారు ఇలాంటి సినిమా చేయడం ఏమిటి ? డబ్బు కోసమేనా ? అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఆ సినిమా థియేటర్స్ లో ఒకే అనిపించుకొని OTT లో హిట్టయింది. నిర్మాతగా ఆ సినిమాతో కాస్త బిజినెస్ చేసుకొని కొంత లాభం పొందారు. మళ్ళీ తన కొడుకుని హీరోగా పెట్టి ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ అదే తరహా అడల్ట్ సినిమా ప్లాన్ చేసి రిలీజ్ కి రెడీ చేశాడు.
ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ సుమంత్ హీరోగా తన డైరెక్షన్ లో ‘సతి’ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు ఎమ్మెస్ రాజు. హీరోయిన్ మెహర్ చాహల్ చేతిని పట్టుకొని సుమంత్ మాస్ గెటప్ తో జాతరలో నడుచుకుంటూ వస్తున్న స్టిల్ తో ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మిగతా డీటెయిల్స్ ఏమి చెప్పలేదు కానీ కొంత పార్ట్ షూట్ చేసేశారని తెలుస్తుంది. మరి రాజు గారు ఈ సినిమాతో అయినా కొడుకు సుమంత్ కి దర్శకుడిగా ఓ సూపర్ హిట్ అందిస్తారా ? చూడాలి.
This post was last modified on May 10, 2022 12:54 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…