కొన్ని టైటిల్స్ ఫస్ట్ లుక్ కంటే ముందే సోషల్ మీడియాలో లీకుల రూపంలో చక్కర్లు కొడుతుంటాయి. మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ టైటిల్ కూడా మేకర్స్ చెప్పకముందే బయటికి వచ్చేసింది. అయితే ఈ టైటిల్ లీక్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు మహేష్. యాంకర్ సుమ ఈ టైటిల్ ఎప్పుడనుకున్నారు ? అని డైరెక్టర్ ని అడగ్గానే మహేష్ గారితో సినిమా అంటే నంబర్ తో కాకుండా ముందు నుండి టైటిల్ తోనే సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని ఫీలయ్యాను అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
ఇంతలో మహేష్ అందుకొని జిమ్ లో తను వర్కౌట్స్ చేస్తుండగా టైటిల్ లీకైందని నమ్రత వచ్చి చెప్పిందని, అప్పుడు పరశురాం గారికి కాల్ చేసి మన టైటిల్ ఏంటి ఏదో లీకైంది అంటున్నారు నిజమేనా ? అని అడిగితే ఈ టైటిల్ చెప్పారని చెప్పుకున్నాడు. అప్పటి వరకూ నాకు కూడా ఇదే టైటిల్ అని తెలియదు. వినగానే అదిరింది అనేసి గో హేడ్ అన్నాను. ఇంతకీ ఈ టైటిల్ బయటికి ఎలా బయటికి వచ్చిందో తెలియదు అంటూ తను షాక్ అయిన విషయం బయటపెట్టాడు మహేష్.
ఇక మహేష్ అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా దర్శకుడు పరశురాం టైటిల్ లోగో డిజైనింగ్ కి ఇచ్చే క్రమంలో ఎక్కడో లీక్ అయ్యి ఉండొచ్చని కవర్ చేసుకున్నాడు. పైగా ఆయనకున్న ఫ్యాన్స్ ఇలాంటి విషయాలపై అలర్ట్ గా ఉంటారు. సో అలా లీకై ఉండొచ్చని అన్నాడు. ఇక సుమ కూడా మీ సినిమా విశేషాలు మీకంటే ముందే ఫ్యాన్స్ కి తెలుస్తున్నాయి అంటే మీ ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటున్నారో తెలిసిపోతుంది అంటూ అందుకుంది. ఇక మహేష్ కి చెప్పకముందే టైటిల్ బయటికెలా వచ్చింది ? పరశురాం హీరోకి టైటిల్ చెప్పకుండానే టైటిల్ ఫిక్స్ చేసేశాడా ? అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో మెదులుతున్న క్వశ్చన్స్.
This post was last modified on May 9, 2022 5:55 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…