ఏడాది పొడవునా ఎన్ని సీజన్లు సెలవులు ఉన్నా సంక్రాంతికుండే బాక్సాఫీస్ స్టామినా ఇంకే నెలలోనూ ఉండదన్నది వాస్తవం. ఒకవేళ ఇప్పుడొస్తున్న సర్కారు వారి పాట కనక జనవరిలో రిలీజ్ అయ్యుంటే ఇప్పుడున్న హైప్ రెట్టింపై కలెక్షన్లలో కూడా చాలా మార్పు కనిపించేది. ఆ పండగ పవర్ అలాంటిది. అందుకే ప్రతి ఏడాది ముందస్తుగానే దాని కోసం నిర్మాతలు హీరోలు పోటీ పడటం కనిపిస్తుంది. ఇప్పుడు 2023లోనూ అలాంటి సీనే రిపీట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. పోటీ ఆ రేంజ్ లో ఉండబోతోంది.
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ ని సంక్రాంతికి తీసుకురావడం ఫిక్స్ అయ్యింది. అఫీషియల్ గా డేట్ ప్రకటించడమొకటే పెండింగ్. శ్రీరాముడి బ్యాక్ డ్రాప్ లో రూపొందటంతో ప్యాన్ ఇండియా రేంజ్ లో ఓపెనింగ్స్ మాములుగా ఉండవు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని ఇదే బరిలో దింపబోతున్నారు. క్రిష్ డైరెక్షన్ లో ఏఎం రత్నం నిర్మించిన ఈ గ్రాండియర్ పవర్ స్టార్ కెరీర్ లోనే ఖరీదైన సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళికు అనుకున్నారు కానీ సాధ్యపడేలా లేదు.
తమిళ స్టార్ హీరో విజయ్ రష్మిక మందన్న కాంబోలో వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్న తలపతి 66 పొంగల్ రేస్ లో ఉంటుందని దిల్ రాజు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు ఆరవ ఫెస్టివల్ సెంటిమెంట్ కాబట్టి విజయ్ పోటీకే సిద్ధపడతాడు. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ సమంతాలతో శివ నిర్వాణ చేస్తున్న మూవీ కూడా అప్పుడేనట. ప్రస్తుతానికి ఇవి పండగను టార్గెట్ చేసుకున్న సినిమాలు. సో ఏడు నెలల ముందే సంక్రాంతి గురించి ఇంత కాంపిటీషన్ ఉందంటే ఆ టైం మహత్యం అలాంటిది మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates