Movie News

ఎట్టకేలకు ఫస్ట్ హిట్.. లాభం లేకపోయె

రుక్సర్ ధిల్లాన్.. నాని లాంటి స్టార్ హీరోతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అమ్మాయి. అంతకంటే ముందు ‘ఆకతాయి’ అనే చిన్న సినిమాలో ఆమె నటించింది. నాని సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ఆమె కెరీర్ మరో రకంగా ఉండేదేమో. కానీ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అల్లు శిరీష్‌తో ‘ఏబీసీడీ’ అనే చిత్రంలో నటించిందామె. ఓ మలయాళ హిట్ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రమూ ఆమెకు నిరాశనే మిగిల్చింది.

తర్వాత ఎస్.ఎస్.కాంచి దర్శకత్వంలో ‘షో టైమ్’ అనే వైవిధ్యమైన సినిమాలో నటించింది రుక్సర్. కానీ ఆ చిత్రం ఎందుకో విడుదలకే నోచుకోలేదు. ఇలా రుక్సర్‌కు టాలీవుడ్లో వచ్చిన ఏ అవకాశమూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మీదే నిలిచాయి. ఈ సినిమా ప్రోమోలు ప్రామిసింగ్‌గా కనిపించాయి. రుక్సర్ వాటిలో బాగానే హైలైట్ అయింది. ఇప్పుడీ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సినిమా వీకెండ్లో బాగానే ఆడింది.

వీక్ డేస్‌లో కూడా ఓ మోస్తరుగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సినిమా హిట్ అనే విషయంలో సందేహం లేదు. కానీ కెరీర్లో తొలి హిట్ కొట్టిన ఆనందం రుక్సర్‌కు మిగిలేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినిమాలో ఆమె పాత్ర ఎన్నో అంచనాలు రేకెత్తించి మధ్యలో సైడ్ అయిపోయింది. పోస్టర్ల మీద, ప్రోమోల్లో అసలేమాత్రం కనిపించని రితిక అనే మరో హీరోయిన్ సినిమాలో బాగా హైలైట్ అయింది. సినిమా చివరికొచ్చేసరికి అందరూ ఆమె ప్రేమలోనే పడిపోయేలా రచయిత, దర్శకుడు తన పాత్రను తీర్చిదిద్దారు.

ఇంటర్వెల్ దగ్గర్నుంచి రుక్సర్ పాత్ర పూర్తిగా పక్కకు వెళ్లిపోయి, ఆమెను అందరు మరిచిపోయే పరిస్థితి వస్తుంది. చివర్లో రీఎంట్రీ ఇచ్చినా ఆ పాత్ర ఇంపాక్ట్ ఉండదు. అసలు సినిమాలో రుక్సర్ లీడ్ హీరోయిన్ అని చెప్పలేని పరిస్థితి. పాత్ర ప్రాధాన్య పరంగా చూసినా.. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో చూసుకున్నా రితికనే సినిమాలో హైలైట్ అయింది. రుక్సర్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టయినా.. రుక్సర్‌కు దక్కాల్సిన ప్రయోజనం దక్కడం అనుమానమే.

This post was last modified on May 9, 2022 3:12 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

41 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago