సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మహేష్ పోకిరి రేంజ్ హిట్ కొడతాడని.. అదే స్థాయిలో ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని చాలామంది అంటున్నారు. ఎందుకో కానీ అభిమానులు ముందు నుంచి ఈ సినిమాకు, పోకిరికి లింక్ పెడుతూనే ఉన్నారు.
పూరి జగన్నాథ్ శిష్యుడైన పరశురామ్ ఈ సినిమాను రూపొందించడం, ఇది ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుండటమే అందుకు కారణం కావచ్చు. కాగా మహేష్ బాబు కూడా ఈ సినిమాను పోకిరితో పోల్చుకుంటున్నాడేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమైందని, అందరూ థియేటర్లలోనే సినిమా చూసి ఆనందించాలని పేర్కొంటూ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తర్వాతి సినిమా షూట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు.
కాగా 2006లో పోకిరి విడుదలకు ముందు కూడా మహేష్ ఇలాగే అభిమానులకు లేఖ రాయడం విశేషం. పోకిరి టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని, ఆడియో హిట్టయిందని, అలాగే ఈ సినిమా చూసి తమ అభిప్రాయాలు చెప్పాలని అభిమానులను ఉద్దేశించి అప్పుడు పేర్కొన్నాడు మహేష్. అంతే కాక తన తర్వాతి చిత్రం సైనికుడు షూటింగ్ అప్‌డేట్ కూడా అందులో ఇచ్చాడు. ఆ లేఖ, ఇప్పుడు సర్కారు వారి పాట విడుదలకు ముందు రాసిన లేఖలో పోలికలు కనిపిస్తుండటంతో.. పోకిరి సెంటిమెంటుతోనే మహేష్ ఈ లెటర్ రాసి ఉండొచ్చని, కాబట్టి పోకిరి మాదిరే సర్కారు వారి పాట బ్లాక్‌బస్టర్ అయి మహేష్‌కు, అభిమానులకు అమితానందాన్ని కలిగిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నపుడు కూడా మహేష్ ‘పోకిరి’తో ఈ సినిమాకు పోలిక పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on May 8, 2022 11:11 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…