దేశవ్యాప్తంగా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాల్లో ముందువరుసలో ఉన్న బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్. దీని ప్రీమియర్ కు డేట్ లాక్ అయ్యిందని సమాచారం. ఈ నెల 20 తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ ల్యాంగ్వేజెస్ జీ5లో, హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయట. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ మరికొద్ది రోజుల్లో ప్రకటన రాబోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, అభిమానులు రిపీట్ రన్ లో చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఓటిటిలోనూ హయ్యెస్ట్ వ్యూస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆర్ఆర్ఆర్ మొదట పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారని తెలిసింది. అంటే కొంత మొత్తాన్ని చెల్లించి నిర్దేశిత సమయంలోగా చూసేయడం పూర్తి చేయాలి. గతంలో కెపే రణసింగం, సల్మాన్ ఖాన్ రాధే, ఖాలీ పీలిలు ఈ తరహాలో జీ4 మల్టీప్లెక్స్ అమలు పరిచింది. అయితే అవి డైరెక్ట్ ఓటిటి రిలీజులు. కానీ ట్రిపులార్ అలా కాదు. థియేటర్లో వచ్చి 50 రోజులవుతోంది. అలాంటప్పుడు డబ్బులు పెట్టి ఎందరు చూస్తారనేది ఆసక్తికరం. ఇంకా చూడనివాళ్ళ సంఖ్య గట్టిగానే ఉంటుంది కాబట్టి రెవిన్యూ ఎంతొస్తుందో చూడాలి.
ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్ తమిళ వర్షన్ HD పైరసీ ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవ్వడం ఫ్యాన్స్ ని నివ్వెరపరిచింది. ఏదో విదేశీ సర్వర్ నుంచి అక్కడ డిజిటల్ హక్కులు కొన్న సంస్థ ద్వారా బయటికి వచ్చిందని టాక్. కెజిఎఫ్ 2 కూడా ఇదే తరహాలో హ్యాకింగ్ బారిన పడినట్టు వినికిడి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ పే పర్ వ్యూ మోడల్ లో కనక వస్తే జూన్ 3 నుంచి కామన్ వర్షన్ లో అందుబాటులో ఉంచుతారట. రాజమౌళి ఆవిష్కరించిన విజువల్ గ్రాండియర్ అఫీషియల్ ఓటిటి ప్రకటన కోసం లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on May 6, 2022 4:50 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…