ఇటివలే ‘రాజ రాజ చోర’తో డీసెంట్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు ఆ వెంటనే ‘అర్జున ఫల్గున’ తో ఫ్లాప్ అందుకున్నాడు. ఒకప్పుడు బెస్ట్ స్క్రిప్ట్స్ ఎంచుకొని ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సక్సెస్ రేషియో తగ్గించేసుకుంటున్నాడు. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’ సినిమాకి బజ్ లేకపోవడమే దీనికి ఉదాహరణ. తన కెరీర్ లో ఇప్పటి వరకూ ఓ సాలిడ్ హిట్ అందుకోకపోవడం ఈ హీరోకి ఓ పెద్ద రిమార్క్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి మళ్ళీ విభిన్న కథలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు శ్రీ విష్ణు.
తనకి లేటెస్ట్ గా ‘రాజ రాజ చోర’ తో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హసిత్ గోలితో ఓ డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో శ్రీ విష్ణు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ‘భళా తందనాన’ ప్రమోషన్ల్ ఇంటర్వ్యూ లో కన్ఫర్మ్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎనౌన్స్ మెంట్ రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ కాంబో సినిమాను నిర్మిస్తుంది.
ఇప్పటి వరకూ యంగ్ హీరోల్లో ఎవరికీ ట్రిపుల్ రోల్ చేసే స్క్రిప్ట్ దొరకలేదు. ఆ ఛాన్స్ శ్రీ విష్ణుకే దక్కిందని చెప్పొచ్చు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు , కృష్ణ , చిరంజీవి , బాలకృష్ణ ట్రిపుల్ రోల్స్ చేసి నటులుగా ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ ‘జై లవకుశ’ తర్వాత తెలుగులో మళ్ళీ ట్రిపుల్ రోల్ సినిమా రాలేదు. ఇప్పుడు శ్రీ విష్ణు ఈ మూవీతో ఆ కేటగిరిలో చేరబోతున్నాడు. తన నుండి రాబోయే ‘అల్లూరి’ సినిమా మీద కూడా ఈ యంగ్ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ లో ఈ సినిమా సెన్సేషన్ అవుతుందని చెప్తున్నాడు. ఇకపై తన నుండి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని డిఫరెంట్ కథలతో సినిమాలు రానున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు.
This post was last modified on May 5, 2022 8:25 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…