RRR సినిమాకు సంబంధించి ఎన్ని రకాల ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేసేసి అందులో మాస్టర్ అనిపించుకున్నాడు రాజమౌళి. నిజానికి జక్కన్న టీం కూడా ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకొని ఎవరూ చేయాలనివన్నీ సాధించారు. అయితే ఒక్క విషయంలో మాత్రం RRR టీంని దాటి ‘సర్కారు వారి పాట’ టీం సాధించారు. అవును ట్విట్టర్ లో సర్కారు వారి పాట సినిమా పేరు టైప్ చేయగానే మహేష్ స్టిల్ తో ఓ ఎమోజీ రావడం అనేది మహేష్ టీం సాధించింది. నిజానికి ఇది కొత్తగా వచ్చిన ప్రమోషన్ కాదు.
గతంలో రజినీ కాంత్ సినిమాతో ట్విట్టర్ లో ఈ ఎమోజీ ప్రమోషన్ స్టార్టయింది. ఇటివలే విజయ్ ‘బీస్ట్’ సినిమాకు అలాగే ‘KGF2’ సినిమాలకు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. అయితే ఇప్పటి వరకూ తెలుగు సినిమాకు ట్విట్టర్ లో ఈ ఎమోజీ రాలేదు. పాన్ ఇండియా వైజ్ ఒక ఊపు ఊపేసిన RRR సినిమాకి కూడా ఈ ఎమోజీ రాలేదు. రాజమౌళి టీం దీని మీద ఫోకస్ పెట్టలేదేమో కానీ ఇప్పుడు మహేష్ టీం మాత్రం ఈ ఎమోజీ అందుకొని ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సినిమాకి ఎమోజీ అనే ట్యాగ్ కొట్టేశారు.
RRR టీం దీన్ని ఎందుకు లైట్ తీసుకున్నారో తెలియదు కానీ ట్విట్టర్ లో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసేందుకు ఈ ఎమోజీ బాగా ఉపయోగపడుతుంది. తమిళ్, కన్నడ బడా సినిమాలు దీన్ని బాగా వాడుకుంటున్నాయి. అందుకే మహేష్ టీం దీన్ని సాధించి twitter లో ఉదయం నుండి వివిధ ట్యాగ్స్ ఎమోజీ లతో హంగామా స్టార్ట్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ ట్యాగ్ ని ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రిలీజ్ దగ్గర పడుతుండటంతో మరింత యాక్టివ్ అయ్యారు. తమ అభిమాన హీరో నుండి కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో స్పెషల్ కేర్ తీసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా సర్కారు వారి పాట నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఈ ఎమోజీతో మొదలైంది. రేపటి నుండి మహేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. మే 7న హైదరాబాద్ లో మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on May 5, 2022 5:17 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…