మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ‘వాల్తేరు వీరయ్య’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమలో చిరుతో కలిసి రవితేజ ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడు. అయితే రవితేజ కేరెక్టర్ కి సంబంధించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడట మాస్ మహారాజా. అంతే కాదు క్రాక్ సినిమాలో పాత్రకి ఇందులో పాత్రకి దగ్గరి పోలికలుంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో రవితేజ భార్యగా కేథరిన్ నటిస్తోంది. వీరిద్దరికీ ఓ బేబీ ఉంటుందట. అంటే క్రాక్ లో రవితేజ -శృతి హాసన్ కి బేబీ ఉన్నట్టే. కాకపోతే ఈ కేరెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. అంతే కాదు చిరు సినిమాలో అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడని ఇన్సైడ్ న్యూస్.ప్రస్తుతం చిరు -శృతి హాసన్ మధ్య సీన్స్ తో ఇంకొన్ని సీన్స్ , యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు యూనిట్.
త్వరలోనే రవితేజ -కేథరిన్ ఎపిసోడ్ తీసే ఆలోచనలో ఉన్నారు. అతి త్వరలోనే మెగా ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చి షూట్ లో పాల్గొననున్నాడు రవితేజ. ఆ రోజే రవితేజ కి వెల్కం చెప్తూ ప్రాజెక్ట్ లో మాస్ మహారాజా ఉన్న విషయాన్ని అఫీషియల్ గా చెప్పే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. గతంలో పవర్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ కాప్ గా చూపించి మెప్పించిన బాబీ ఈసారి మాస్ మహారాజాని ఏ స్టైల్ లో ప్రెజెంట్ చేస్తాడో రవితేజ లుక్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంటుంది.
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…