గత వారం ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రం రిలీజైంది. వచ్చే వారం ‘సర్కారు వారి పాట’ అనే పెద్ద సినిమా వస్తోంది. మధ్యలో పెద్ద, మీడియం రేంజ్ సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలోకి దిగలేదు. దీంతో చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశంలా కనిపించింది.
ఎప్పట్నుంచో రిలీజ్ కోసం ఎదురు చూస్తూ, అవకాశం దొరక్క వాయిదాల మీద వాయిదాలు పడుతున్న మూడు చిన్న సినిమాలు ఈ వారానికి కర్చీఫ్ వేశాయి. ఐతే మొన్నటిదాకా ఈ మూడు చిత్రాలకూ పెద్దగా బజ్ కనిపించలేదు. కానీ ఇప్పుడు అందులో ఒక చిత్రానికి కాస్త హైప్ కనిపిస్తోంది.
ఆ చిత్రం.. అశోకవనంలో అర్జున కళ్యాణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ తన ఇమేజ్‌కు భిన్నంగా సున్నితమైన యువకుడి పాత్రలో కనిపించిన సినిమా ఇది. అతడి పెళ్లి చుట్టూ నడిచే కథను విద్యాసాగర్ చింతా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తే.. ‘రాజావారు రాణివారు’ డైరెక్టర్ రవికిరణ్ కోలా దీనికి రచన చేశాడు.
టీజర్, ట్రైలర్లతో ప్రామిసింగ్‌గా కనిపించినప్పటికీ మొన్నటిదాకా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. వరుసగా భారీ చిత్రాలు వస్తుంటే.. ఇలాంటి చిన్న సినిమాలపై ప్రేక్షకుల ఫోకస్ నిలవడం కష్టమే. ఐతే ఓవైపు జోరుగా ప్రమోషన్లు చేయడం, మరోవైపు టీవీ9 స్టూడియోలో విశ్వక్‌కు, యాంకర్ దేవికి జరిగిన గొడవ-తదనంతర పరిణామాలతో ఈ చిత్రం బాగానే ప్రేక్షకుల నోళ్లలో నానింది.
ఈ వారం ఈ సినిమా రిలీజవుతోంది అనే విషయం జనాల్లోకి వెళ్లింది. ఇదంతా ప్లాన్ చేసి చేసిన కాంట్రవర్శీ కాకపోవచ్చు కానీ.. సినిమాకు కోరుకున్న ప్రచారం అయితే లభించింది. ఈ వారం బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచే అవకాశాలు విశ్వక్ చిత్రానికే ఉన్నాయన్నది స్పష్టం. ఇక సుమ సినిమా ‘జయమ్మ పంచాయితీ’ కంటెంట్ పరంగా టాప్‌లో ఉండేలా కనిపిస్తోంది. దాని ట్రైలర్లు భలేగా అనిపిస్తున్నాయి.
కాకపోతే సుమ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఏమేర థియేటర్లకు వస్తారన్నదే సందేహం. ఇక శ్రీ విష్ణు సినిమా ‘భళా తందనాన’ ట్రైలర్‌తో అంతగా ఆకర్షించలేకపోయింది. కానీ అతడి ట్రాక్ రికార్డు, చైతన్య దంతులూరి గత సినిమాలను బట్టి చూస్తే ఇది ఆషామాషీ సినిమా అయితే కాకపోవచ్చు. మరి ఈ మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
This post was last modified on May 4, 2022 6:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…