మొన్నీ మధ్యే విశ్వక్ సేన్ హీరోగా పాగల్ డైరెక్టర్ నరేష్ దర్శకత్వంలో ‘ధమ్కి’ అనే సినిమా మొదలైంది. ప్రసన్న కుమార్ బెజవాడ కథతో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమాకి వారం తిరగకుండానే డైరెక్టర్ పేరు మారింది. నరేష్ ప్లేస్ లో విశ్వక్ దర్శకత్వ భాద్యతను తీసుకొని నరేష్ ని ప్రాజెక్ట్ లో నుండి తీసేశాడు.
అయితే ఒక డైరెక్టర్ ని తీసేసి అదీ ఓపెనింగ్ అయ్యాక విశ్వక్ సేన్ పెద్ద తప్పే చేశాడని అందరూ మాట్లాడుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణం చేతే ఈ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ ని తొలగించి విశ్వక్ ఉన్నపళంగా టేకాఫ్ చేశాడని అనుకున్నారు.
తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో. ‘ధమ్కి’ కథను ప్రసన్నా ఇచ్చాడని కానీ కథలో నాకు కావాల్సిన ఎలిమెంట్స్ యాడ్ చేయడం జరిగిందని, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసుకున్నానని ఒక దర్శకుడిని పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఇంటర్ఫీయరన్స్ అయినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే నరేష్ కి ఇంకో సినిమా చేద్దామని చెప్పానని అన్నాడు.
ఇక దర్శకుడిగా నాకు కూడా పేరు వస్తుందని ఆలోచించి నేనే టేకాఫ్ చేశానని చెప్పుకున్నాడు. ఈ సినేరియాలో విశ్వక్ స్క్రిప్ట్ లో వేలు పెట్టాడనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకే దర్శకుడికి హీరో కి మధ్య డిఫరెన్స్ లొచ్చి ప్రాజెక్ట్ టోటల్ గా హీరో కాంపౌండ్ లోకి వెళ్ళిపోయింది.
ఇక ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని కాకపోతే టైటిల్ ‘మాస్ కా దాస్’ అని పెట్టనున్నామని తెలిపాడు విశ్వక్. ఆ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా మూవీగా తీర్చి దిద్దనున్నానని ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కి ఆ సినిమాతో దగ్గరవ్వాలని భావిస్తున్నానని చెప్పుకున్నాడు. రెండు మూడు కమిట్ మెంట్స్ పూర్తవ్వగానే ఈ సీక్వెల్ తీస్తానని తెలిపాడు.
ఏదేమైనా ఈ కుర్ర హీరోకి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే దర్శకుడిగానే ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నట్టుండి. అందుకే కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైంలో అనవసరంగా రిస్క్ చేస్తూ డైరెక్షన్ బరువు కూడా భుజాన వేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడు. ఫలక్ నుమా దాస్ అంటే రీమేక్ సినిమా. అందులో విశ్వక్ దర్శకుడిగా చేసిందేమి పెద్దగా లేదు. మక్కీ కి మక్కీ ఒరిజినల్ ని దింపేశాడు. షాట్స్ తో సహా… మరి ఈసారి ధమ్కి తో దర్శకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. దాని రిజల్ట్ బట్టే ‘మాస్ కా దాస్’ విశ్వక్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా తెలుస్తుంది.
This post was last modified on May 4, 2022 5:25 pm
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…