Movie News

మంచు ఫ్యాన్స్ రివెంజ్

రెండు నెలల కిందట ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా రిలీజైనపుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలోనే అతి గొప్ప నటుల్లో ఒకడు.. 500కు పైగా చిత్రాల్లో నటించి 80, 90 దశకాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు చూసిన మోహన్ బాబు నటించిన సినిమాకు మెజారిటీ థియేటర్లలో కనీసం పది మంది కూడా ప్రేక్షకులు లేని దయనీయమైన పరిస్థితి తలెత్తింది.

అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా థియేటర్లలో ముందు రోజు వరకు ఒక్క టికెట్ కూడా అమ్ముడు కాకపోవడం.. కొన్ని థియేటర్లలో 1, 2 టికెట్లు తెగడం పట్ల విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీని మీద ఎన్ని జోకులు పేలాయో.. ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్క లేదు. ఐతే ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీతో మంచు వారి కయ్యం నేపథ్యంలో ఈ ట్రోలింగ్‌ను వెనుక ఉండి నడిపించింది మెగా అభిమానులే అని మంచు వారు బలంగా నమ్మారు. ఈ ట్రోలింగ్ మీద ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

కట్ చేస్తే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజైంది. ఈ చిత్రానికి తొలి రోజు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. డే-1 కలెక్షన్లు బాగానే ఉన్నా.. తర్వాత ఈ చిత్రం చతికిలపడింది. వీకెండ్లోనే సరైన వసూళ్లు సాధించలేకపోయింది. వారాంతం అయ్యాక పరిస్థితి దయనీయంగా తయారైంది. బుకింగ్స్ దారుణాతి దారుణంగా తయారయ్యాయి.

దీంతో ఇప్పుడు మంచు ఫ్యామిలీ మద్దతుదారులు, అభిమానులు రంగంలోకి దిగారు. ‘ఆచార్య’ మీద వారి స్థాయిలో వాళ్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివిధ నగరాల్లో ‘ఆచార్య’కు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ కనీస స్థాయిలో ఉండటంపై స్క్రీన్ షాట్లు తీసి.. రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వీరికి వేరే మెగా యాంటీ ఫ్యాన్స్ కూడా తోడవుతున్నారు. అందరూ కలిసి మెగా ఫ్యామిలీ సినిమా మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. వాళ్లు ట్రోల్ చేశారని కాదు కానీ.. ‘ఆచార్య’కు బాక్సాఫీస్ దగ్గర మరీ ఇంత దయనీయమైన పరిస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

This post was last modified on May 4, 2022 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago