మాములుగా తెలుగు సినిమాలకు తమిళనాడులో ఆదరణ తక్కువ. ఒక్క రాజమౌళి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచాయి. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు రెండే. మగధీరను అక్కడివాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈగ పాస్ అనిపించుకుంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక స్ట్రెయిట్ గా రిలీజ్ చేసే టాలీవుడ్ మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సర్కారు వారి పాట ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది.
చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్ థియేటర్లో తెల్లవారుఝామున 4 గంటలకు ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేయబోతున్నట్టు ఆ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో ఈ ఘనతను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ టైంకు వేశారు కానీ అది తమిళంలోకి అనువాదం చేసిన ప్రింట్ . సో సర్కారు వారి పాట ఈ రకంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఏపి తెలంగాణాతో సమానంగా చెన్నైలోనూ షోలు పడటం అంటే అక్కడ ఉన్న మహేష్ బాబు అభిమానులను అంతకన్నా కానుక ఏముంటుంది.
ఏదో ఆషామాషీ థియేటర్లో ఈ ప్రీమియర్ జరగడం లేదు. రోహిణి అంటే మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నది. ఉదయం నాలుగు గంటలకు కేవలం విజయ్, అజిత్, రజినీకాంత్ సినిమాలకు మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. అలాంటిది సర్కారు వారి పాటకు నేరుగా తెలుగు వెర్షనే వేయడం అంటే సంథింగ్ స్పెషలే. 12న విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా వచ్చిన గ్యాప్ కావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు
This post was last modified on May 4, 2022 1:29 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…