ఇంకా విడుదలకు టైం ఉంది కానీ విజయ్ దేవరకొండ పూరి కాంబినేషన్ లో రూపొందిన లైగర్ రికార్డులు అప్పుడే మొదలైపోయాయి. నాన్ థియేట్రికల్ హక్కులను 106 కోట్లకు డీల్ చేశారని బాలీవుడ్ టాక్. అందులో ఒక్క ఆడియో రైట్స్ నుంచే 14 కోట్ల దాకా సమకూరాయట. హిందీ వెర్షన్ తో పాటు సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ భాగస్వామ్యం ఉండటంతో బిజినెస్ వ్యవహారాలు అనుకున్న దానికంటే వేగంగా ఎక్కువగా పూర్తవుతున్నాయి.
అందులో భాగంగానే లైగర్ కు ఈ స్థాయిలో రేటు పలికిందని అంటున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంల తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రౌడీ బాయ్ ఆశలన్నీ ఈ లైగర్ మీదే ఉన్నాయి. చాలా కష్టపడి చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపరచడంతో రెండేళ్లకు పైగా సమయాన్ని లైగర్ కోసమే కేటాయించాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి కం సూపర్ సక్సెస్ తర్వాత దాన్ని కొనసాగించాల్సిన అవసరం దర్శకుడు పూరి జగన్నాధ్ మీద కూడా ఉంది. అందుకే తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కెరీర్ లోనే ఎక్కువ టైం దీనికే తీసుకోవడం విశేషం. సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ లైగర్ లో నటించడం ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ బాక్సింగ్ డ్రామాతో అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతోంది. తనిష్క్ బాగ్చి పాటలు సమకూరుస్తున్న ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం జనగణమనతో తమ కాంబోని రిపీట్ చేస్తున్న విజయ్ జగన్ లు తమ ఇతర కమిట్మెంట్స్ వల్ల దాని రెగ్యులర్ షూట్ ఇంకా మొదలుపెట్టలేదు
Gulte Telugu Telugu Political and Movie News Updates