యువ కథానాయకుడు విశ్వక్సేన్‌కు, టీవీ9 స్టూడియాలో యాంకర్ దేవి నాగవల్లికి జరిగిన వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వక్సేన్ దేవికి వేలు చూపించి వార్నింగ్ ఇవ్వడం, ప్రతిగా ఆమె గెట్ ఔట్ ఆఫ్ మై స్టూడియో అంటూ అతడికి హెచ్చరిక జారీ చేయడం.. అతను నువ్వెవ్వరు నన్ను గెటౌట్ అనడానికి అని వాదిస్తూ చొక్కాకున్న మైక్రో ఫోన్ తీసి పడేసి బయటికి వెళ్లిపోవడం.. ఇలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి టీవీ-9 స్టూడియోలో.
అసలు ఇంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఆసక్తికరం. విశ్వక్సేన్ మామూలుగానే తన సినిమాల వేడుకల్లో, ప్రమోషన్లలో కొంచెం దూకుడుగా ఉంటాడు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విషయంలో ఇంకాస్త స్పీడ్ పెంచాడు. ప్రసాద్ ఐమాక్స్ ముందు సినిమా రివ్యూలు చెబుతూ భరించలేని ఓవరాక్షన్ చేసే ఒక కుర్రాడితో కలిసి ఒక ప్రాంక్ వీడియో చేశాడు.
విశ్వక్సేన్ కారు ముందు అతను పడుకుని.. నాకు అర్జున్ కుమార్ అల్లం (అశోకవనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ క్యారెక్టర్ పేరు)ను చూపించు లేకుంటే చచ్చిపోతా అంటూ పెట్రోల్ డబ్బా తీసుకుని ప్రవర్తించడం, విశ్వక్సేన్ అతణ్ని సముదాయించడం.. ఇలా సాగింది ఆ వీడియో. ఐతే నడి రోడ్డు మీద వీళ్లు చేసిన ప్రాంక్ జనాలకు చిరాకు తెప్పించేలాగే ఉంది. దీని మీద టీవీ9 స్టూడియో డిబేట్ పెట్టింది. దీనికి త్రిపురనేని వరప్రసాద్, విశ్వక్సేన్ హాజరయ్యారు.
ఒక లాయర్, మరికొందరిని లైన్లోకి తీసుకుని డిబేట్ నడిపించారు. విశ్వక్ ప్రాంక్ వీడియోను తప్పుబడుతూ ఈ చర్చ సాగింది. పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ విశ్వక్ మీద కేసు వేయబోతున్నట్లు లాయర్ పేర్కొన్నాడు. దీనికి మద్దుతగానే టీవీ9 యాంకర్ దేవి స్టాండ్ తీసుకుంది. ఐతే ప్రాంక్ వీడియో చేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. కేసులేయడం ఏంటంటూ విశ్వక్ వాదించాడు. తనను మెంటల్లీ డిప్రెస్డ్ పర్సన్ అని దేవి పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇందుకు నేను కూడా మీ మీద కేసు వేయగలను.. నన్ను అలా అనే హక్కు మీకు లేదు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.
దీనికి బదులుగా దేవి గెట్ ఔట్ ఆఫ్ మై స్టూడియో అంది. నాకు మీ స్టూడియోకు వచ్చే ఇంట్రెస్టే లేదు.. మీరెవరు నన్ను గెటౌడ్ అనడానికి అని దేవిని నిలదీస్తూనే మైక్ తీసి పడేసి విశ్వక్ స్టూడియో నుంచి బయటికొచ్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశ్వక్ అలాంటి వీడియో చేయడాన్ని తప్పుబడుతూనే.. ఈ టాపిక్ మీద ఈ స్థాయిలో చర్చ పెట్టడం, విశ్వక్‌ను యాంకర్ గెటౌట్ అనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
This post was last modified on May 2, 2022 2:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…