బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల మనోగతం అంత సులభంగా అంతు చిక్కడం లేదు. బాలేదనే మాట వస్తే చాలు మెగాస్టార్ మెగాపవర్ స్టార్ కలిసి నటించిన సినిమా అయినా సరే ఒక్కసారి చూసేందుకు కూడా ఇష్టపడటం లేదని కలెక్షన్లు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్ 2 లాంటి గ్రాండియర్లు చూసిన కళ్ళకు రొటీన్ కంటెంట్ ఆనడం లేదన్నది వాస్తవం.
ఏదో ఒక ప్రత్యేకత లేనిదే టికెట్లు కొని హాలు దాకా రామని వసూళ్ల రూపంలో తేల్చి చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మే 6న టాలీవుడ్ నుంచి మూడు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. అవి అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన, జయమ్మ పంచాయితీ. దేనికీ మినిమం బజ్ లేదు. టాక్ ని బట్టో రివ్యూలను చూసో వెళ్లాలా వద్దాని జనం నిర్ణయించుకుంటారు.
కానీ ఆ లెక్కలేవి లేకుండా టికెట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్. ఇదీ మే 6నే రిలీజ్ కాబోతుండటం ఎంత లేదన్నా పైన చెప్పిన వాటి నిర్మాతలను ఇబ్బంది పెట్టేదే. హైదరాబాద్ తో సహా కీలక నగరాల్లో డాక్టర్ స్ట్రేంజ్ బుకింగ్స్ ఫైర్ మీదున్నాయి. మొదటి మూడు రోజులు దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి.
వేసవి సెలవుల్లో ఉన్న పిల్లలకు ఇదే వన్ అండ్ ఓన్లీ ఛాయస్ గా నిలుస్తోంది. అసలే వారం తర్వాత 12న రిలీజయ్యే సర్కారు వారి పాట రాకముందే సొమ్ము చేసుకుందామని ఆశపడిన విశ్వక్ – శ్రీవిష్ణు – సుమలకు డాక్టర్ గట్టి టెన్షనే పెడుతున్నాడు. కాకపోతే వీటికి చాలా బాగుందనే టాక్ వస్తే వాటి బిజినెస్ కు తగ్గట్టు వసూళ్లు తెచ్చుకోవచ్చు. అంత సీన్ ఉందా లేదనేది నాలుగు రోజుల్లో తేలనుంది
This post was last modified on May 2, 2022 12:14 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…