Movie News

ఆచార్య.. ఇది మామూలు షాక్ కాదు

కరోనా దెబ్బతో దేశీయ మార్కెట్ లాగే యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ కూడా కొంత కాలం డల్లుగా సాగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ కరోనా ప్రభావం బాక్సాఫీస్ మీద మరింతగా పడింది. అక్కడ సినిమా టికెట్ల రేట్లు చాలా ఎక్కువ. పైగా చాలా దూరం ప్రయాణించి వెళ్లి సినిమా చూడాలి. కరోనా భయాలు వెంటాడుతుంటే అంత ఖర్చు పెట్టి, అంత దూరం ప్రయాణించి సినిమా చూడాలన్న ఆసక్తి ఎలా ఉంటుంది. అందుకే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గాక కానీ అక్కడి జనాల్లో కదలిక రాలేదు.

ఐతే ఈ మధ్య యుఎస్ బాక్సాఫీస్ కూడా బాగానే పుంజుకుంది. సరైన సినిమా పడితే వసూళ్ల మోత మోగుతోంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, కేజీఎఫ్ లాంటి చిత్రాలు అక్కడ వాటి వాటి స్థాయిలో కలెక్షన్ల పండించుకున్నాయి. కేవలం వీకెండ్లోనే ‘ఆర్ఆర్ఆర్’ 9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. రాజమౌళి సినిమాతో వేరే చిత్రాలను పోల్చలేం కానీ.. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ లాంటి తిరుగులేని ట్రాక్ రికార్డున్న దర్శకుడు తీసిన సినిమా మామూలుగా అయితే యుఎస్‌లో వసూళ్ల మోత మోగించాలి.

వీకెండ్లో అత్యధిక వసూళ్లు వచ్చే రోజైన శనివారం పాజిటివ్ టాక్‌తో మిలియన్ డాలర్లు కొల్లగొట్టేయాలి. టాక్ బాగా లేకుంటే అందులో సగం వసూళ్లైనా రావాలి. కానీ శనివారం ఈ చిత్రానికి యుఎస్‌లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా? కేవలం 90 వేల డాలర్లు. ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. ఈ స్థాయి సినిమా శనివారం కనీసం లక్ష డాలర్లు కూడా రాబట్టలేకపోవడం మామూలు షాక్ కాదు.

ఒక రోజులో యుఎస్‌లో చిరు-చరణ్‌ల సినిమా కేవలం మన లెక్కల్లో ఏడు లక్షలకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టిందంటే ఇది ఎంత అండర్ పెర్ఫామ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రిమియర్స్ కోసం ఆసక్తి చూపేవారిని పక్కన పెడితే.. యుఎస్ ప్రేక్షకులు రివ్యూలను అనుసరించే వీకెండ్లో సినిమాలకు వెళ్తారు. ముఖ్యగా వారికి సినిమాలు చూడటానికి ఫేవరెట్ డే. కానీ ‘ఆచార్య’కు బ్యాడ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాను అక్కడి వాళ్లు అవాయిడ్ చేస్తున్నారని అర్థమైంది. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించట్లేదన్నది స్పష్టం.

This post was last modified on May 2, 2022 10:29 am

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

9 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

15 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago