సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కి సంబంధించి భారీ ప్రమోషన్ ప్లాన్ రెడీ అయింది. మే 2న రిలీజయ్యే ట్రైలర్ తో సినిమా మీద బజ్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. అయితే మహేష్ కూడా ట్రైలర్ లాంచ్ నుండే రంగంలోకి దిగనున్నాడు. తన ప్రతీ సినిమాను మీడియా ముందుకొచ్చి స్పెషల్ గా ప్రమోట్ చేసుకునే మహేష్ ‘సర్కారు వారి పాట’ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకొని ప్రమోషన్ చేయబోతున్నాడని తెలుస్తుంది.
మే మొదటి వారమంతా మహేష్ ప్రమోషన్స్ కి టైం ఇచ్చి షెడ్యుల్ లాక్ చేసుకున్నాడని సమాచారం. మే 10 వరకూ మహేష్ ఇంటర్వ్యూలు మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చేలా టీం ప్లాన్ రెడీ చేస్తున్నారట. అలాగే దర్శకులతో ఇంటర్వ్యూలు వగైరా లాంటివి కూడా ఏవో ప్లాన్ చేస్తున్నారట.
ముఖ్యంగా భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని మీట్ అవ్వబోతున్నాడట సూపర్ స్టార్. నిజానికి సినిమా ఓపెనింగ్స్ కి రాకపోయినా రిలీజ్ కి మాత్రం తన వంతుగా ప్రమోషన్ చేసి పెట్టడం మహేష్ లో బెస్ట్ క్వాలిటీ. తన స్టార్డం , క్రేజ్ పక్కన పెట్టి మీడియా ముందుకొచ్చి అందరికీ ఇంటర్వ్యూ లు ఇస్తూ సరదాగా ఉంటాడు.
రిలీజ్ కి ముందు ప్రమోషన్ చేశాకే తన ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకుంటాడు మహేష్. కానీ రిలీజ్ తర్వాత టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ మీడియాకి కనబడడు. మరి ఈసారి మహేష్ ‘సర్కారు వారి పాట’ ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడో ? మహేష్ టీం ఎలాంటి ప్లాన్ రెడీ చేశారో చూడాలి.
This post was last modified on April 30, 2022 10:54 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…