ఏదైనా పెద్ద సినిమా నిరాశ పరిస్తే మొదటి షో నుండే అందరూ డైరెక్టర్ ని బ్లేమ్ చేస్తూ పోస్టులు పెట్టడం కామనే. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కాబట్టి సినిమా టాక్ తేడా వస్తే ముందుకు మాట్లాడుకునేది డైరెక్టర్ గురించే. అందుకే సినిమా విషయంలో ఎవరు వేలు పెట్టినా, పెట్టకపోయినా బ్యాడ్ నేమ్ వచ్చేది దర్శకుడికే. నిన్న విడుదలైన ‘ఆచార్య’ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కొరటాల బంగారం లాంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడని నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
కానీ కొరటాల శివ మీద సాఫ్ట్ కార్నర్ ఉండే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఇది కొరటాల తీసిన సినిమా కాదని, చిరుతో పాటు మిగతా కొందరు ఇన్పుట్స్ ఇస్తూ స్క్రిప్ట్ లో కలగచేసుకొని ఉండొచ్చని అనాల్సిస్ చేస్తున్నారు. సరిగ్గా సోషల్ మీడియాలో ఈ విషయం మీద చర్చ జరుగుతున్న తరుణంలో ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. రిలీజ్ కి ముందు చిరు కొరటాల కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో “హానెస్ట్ గా చెప్తున్నా.. నేను డైరెక్షన్ చేయలేదు” అనే మాట వాడాడు కొరటాల. దాన్ని పట్టుకొని మెగా యాంటి ఫ్యాన్స్ ఇదిగో కొరటాల శివని అసలు డైరెక్షన్ చేయనివ్వలేదు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా చిరు ముందే చెప్పాడు కొరటాల అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.
నిజానికి ఆ ఇంటర్వ్యూలో కొరటాల ఆ మాట వాడిన సందర్భం వేరు. సెట్స్ లో చిరు -చరణ్ కలిసి నటించే సన్నివేశాలు ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయానని ఆ టైంలో అసలు డైరెక్షన్ చేయలేదని తన సంతోషాన్ని ఆ మాట రూపంలో చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ‘ఆచార్య’ రిజల్ట్ తేడా కొట్టడంతో యాంటి ఫ్యాన్స్ ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇలా నెగిటివ్ గా వాడుకుంటూ మెగా ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తున్నారు.
This post was last modified on April 30, 2022 3:07 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…