Movie News

మణిశర్మతో గొడవ.. నిజమేనా?

కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆచార్య’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. మునపటిలా చిరంజీవి సినిమాకి ఉండే క్రేజ్ , బజ్ లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మార్నింగ్ షో కే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మెగా మూవీ. ముఖ్యంగా మ్యూజిక్ పై బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మణిశర్మ సినిమాకు పెద్ద మైనస్ అంటూ ఉదయం నుండి సోషల్ మీడియాలో మెలోడీ బ్రహ్మ వర్క్ గురించి చెప్పుకుంటున్నారు.

నిజమే మణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలహీనతే ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. 
ఇక కొరటాల అంతో ఇంతో సినిమాలో యాక్షన్ వడ్డించాడు కానీ దానికి సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడలేదు. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. నిజానికి ఆచార్య కి అవుట్ డేటెడ్ మ్యూజిక్ ఇచ్చాడు మణి.

రిలీజ్ కి ముందు కొరటాల – మణిశర్మ మధ్య రీ రికార్డింగ్ గురించి ఓ పెద్ద డిస్కషన్ కూడా జరిగిందట. మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చక ఏమి చేయలేని పరిస్థితిలో కొరటాల మణి తనయుడు మహతి సాగర్ తో లాస్ట్ పార్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయించుకున్నాడని ఓ న్యూస్  చక్కర్లు కొట్టింది. అందుకే ఫస్ట్ కాపీ డిలే అంటూ ఇన్సైడ్ టాక్ వినిపించింది. 

అసలు బ్యాక్ స్కోర్ కి పెట్టింది పేరు అయిన మణిశర్మ అలా చేసి ఉండరు. ఇది జస్ట్ రూమర్ అంటూ కొరటాల -మణి ఇష్యూ ని లైట్ తీసుకున్న వారు ఆచార్య సినిమా చూశాక అది నిజమే అయి ఉంటుందంటూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా మెగాస్టార్ – మణి శర్మ కాంబో అంటే ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ భారీగా సేల్ అయ్యేవి. మణి తన బ్యాక్ గ్రౌండ్ తో చిరు సినిమాలను నిలబెట్టిన సందర్భాలెన్నో. మరి ఈ రేంజ్ సూపర్ హిట్ కాంబో ఫర్ ది ఫస్ట్ టీం ఆడియన్స్ ని నిరాశ పరిచింది. ‘ఆచార్య’ తో అందుకున్న ఫీడ్ బ్యాక్ తో మణి ఇకపై బెస్ట్ వర్క్ ఇచ్చి మళ్ళీ ఒకప్పటి పనితనం చూపిస్తే బడా సినిమాలన్నీ అతన్ని వెతుక్కుంటూ వెళ్తాయనడంలో సందేహమే లేదు.

This post was last modified on April 30, 2022 5:34 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

54 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago