శ్రీ విష్ణు కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా ‘భళా తందనాన’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీ అయినప్పటికీ.. సరైన రిలీజ్ టైమింగ్ కోసం ఎదురుచూస్తోంది చిత్ర బృందం. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే 29న ‘ఆచార్య’ రిలీజవుతుండగా.. మరుసటి రోజు రిలీజ్ చేసే సాహసమా అన్న ప్రశ్న తలెత్తింది. ఐతే ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన మరుసటి రోజే చిత్ర బృందం వెనక్కి తగ్గింది. తమ సినిమా 30న రావట్లేదని దర్శకుడు స్వయంగా స్పష్టత ఇచ్చాడు.
ఆ తర్వాత దీని గురించి వార్తల్లేవు. ఐతే శుక్రవారం ‘ఆచార్య’ సినిమా రిలీజై డివైడ్ టాక్ రాగానే ‘భళా తందనాన’ టీంలో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే శుక్రవారం, అంటే మే 6న రిలీజ్ చేయబోతున్నట్లు హడావుడిగా ప్రకటన ఇచ్చేశారు. ‘ఆచార్య’ నుంచి తర్వాతి వారం ఇబ్బంది ఉండదన్న ధీమాతోనే డేట్ ప్రకటించినట్లున్నారు. మే 6న ఇంకో రెండు చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో ఒకటి సుమ ప్రదాన పాత్ర పోషించిన ‘జయమ్మ పంచాయితీ’ కాగా.. ఇంకోటి విశ్వక్సేన్ లీడ్ రోల్‌లో నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. మరి ఈ రెండు సినిమాలతో పోటీ పడి విష్ణు సినిమా భళా అనిపిస్తుందో లేదో చూడాలి. గత కొన్నేళ్లలో ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’ మినహా శ్రీ విష్ణు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ‘తిప్పరా మీసం’, ‘అర్జున ఫల్గుణ’ లాంటి సినిమాలు పూర్తిగా వాషౌట్ అయిపోయాయి.
ఈ నేపథ్యంలో ‘భళా తందనాన’ సక్సెస్ కావడం అతడికి చాలా అవసరం. ఈ చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరికి కూడా ఈ సినిమా విజయవంతం కావడం ఎంతో కీలకం. ‘బాణం’తో ఆకట్టుకున్న అతను.. తర్వాతి చిత్రాలతో నిరాశ పరిచాడు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బేనర్ మీద సాయి కొర్రపాటి నిర్మించారు. శ్రీ విష్ణు సరసన ఇందులో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది. గరుడ రామ్ విలన్ పాత్ర పోషించాడు.
This post was last modified on April 29, 2022 9:01 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…
విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా…
ఫ్ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.…