సినీ రంగంలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సినిమా తీస్తూ కూడా సెంటిమెంట్లను మాత్రం వదలరు సినీ జనాలు. హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఐరెన్ లెగ్ ముద్రలు వేయడం.. తొలి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని దాటలేరనడం.. ఇలా చాలా సెంటిమెంట్లే ఉంటాయి సినీ రంగంలో. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా అపజయమే ఎరుగని, సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న రాజమౌళి విషయంలోనూ ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉండటం విశేషం.
ఆయనతో సినిమా చేసి ఘనవిజయాన్ని అందుకున్న హీరో, మిగతా మెయిన్ ఆర్టిస్టులు తర్వాతి సినిమాతో చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారనే సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. కెరీర్ ఆరంభం నుంచి పరిశీలిస్తే ప్రతి సినిమాకూ దాదాపుగా ఇదే జరిగింది. ‘బాహుబలి’ లాంటి మెగా సక్సెస్ తర్వాత ప్రభాస్ వరుసగా రెండు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ఈ సెంటిమెంట్ ఇంకా బలపడింది. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏం జరుగుతుందా అని ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఒక లీడ్ రోల్ చేసిన రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘ఆచార్య’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే రాజమౌళి సెంటిమెంటు ఈ చిత్రానికి ప్రతికూలంగా మారుతుందేమో అని చిరు ముందే అలెర్ట్ అయ్యారు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆయన ఈ సెంటిమెంట్ ‘ఆచార్య’తో బ్రేక్ అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. చిరు తనకు తానుగా ఈ సెంటిమెంటు గురించి ప్రస్తావించి, చాలా నమ్మకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో ధీమా వచ్చింది.
‘ఆచార్య’ మీద జక్కన్న నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావం ఉండదనే అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు కోరుకున్నది జరగలేదు. చిరు జరగదన్నదే జరిగేట్లు కనిపిస్తోంది. నెగెటివ్ టాక్‌తో మొదలైన ‘ఆచార్య’ వీకెండ్లో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా.. ఆ తర్వాత నిలవడం కష్టమే కావచ్చు. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రతికూల ఫలితాన్నే అందుకుని రాజమౌళి సెంటిమెంటును కొనసాగించేలా ఉంది.
This post was last modified on April 29, 2022 5:58 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…