ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. ఒక సినిమా హిట్టయితే దానికి కొనసాగింపుగా మరో సినిమా రెడీ అవుతుంది. కానీ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల మాత్రం అప్పుడెప్పుడో సూపర్ హిట్ అయిన ‘డీ’ సినిమాకు సీక్వెల్ రెడీ చేసుకున్నాడు. అదే హీరోతో సీక్వెల్ ప్లాన్ చేసుకున్నాడు. మంచు విష్ణునే ప్రాజెక్ట్ కి ప్రొడ్యుసర్ కూడా. ఎనౌన్స్ మెంట్ అయి చాలా రోజులవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకూ ఊసు ఉద్దాపన లేదు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకూ ఈ సీక్వెల్ ఉండదని అంటున్నారు.
అవును శ్రీను వైట్ల తాజాగా ఈ సీక్వెల్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి మరో ప్రాజెక్ట్ కోసం వర్క్ మొదలు పెట్టారని తెలుస్తుంది. ఇక మంచు విష్ణు కూడా కోనా వెంకట్ అండ్ గ్యాంగ్ తో ఏదో కామెడీ సినిమా చేస్తున్నాడు. గాలి నాగేశ్వరరావు అనే కేరెక్టర్ తో హిలేరియస్ సినిమా అంటూ టీం ఊదర గొడుతుంది. ఇక డీ సీక్వెల్ క్యాన్సెల్ అవ్వడానికి ఓ కారణం ఉందట.
శ్రీను వైట్ల తో ఫైనల్ నెరేషన్ తర్వాత మంచు విష్ణు ఓ డిస్కషన్ జరిపారట. ఆ తర్వాత మంచు విష్ణు కోనా వెంకట్ కథ నచ్చింది ముందుగా ఆ సినిమా చేస్తానని వైట్లతో అన్నాడని దీంతో శ్రీను వైట్ల హార్ట్ అయ్యాడని టాక్. కోనా వెంకట్ కి శ్రీను వైట్ల కి మధ్య అప్పట్లో వివాదమైంది. ఆ తర్వాత ఒకరి పేరు చెప్తే మరొకరు ఇగ్నోర్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు తీసుకున్న డిసీషన్ శ్రీను వైట్లతో ప్రాజెక్ట్ క్యాన్సెల్ అయ్యేలా చేసిందని ఇన్సైడ్ టాక్. నిజానికి ‘డీ అండ్ డీ’ అనే టైటిల్ తో ఎనౌన్స్ అయిన ఈ సినిమా కోసం ఆస్థాన రైటర్ గోపి మోహన్ తో శ్రీను వైట్ల ఓ కథ రెడీ చేయించాడు. కానీ ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళకముందే ఎండ్ కార్డు వేసుకుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల మరో హీరోతో ఇంకో ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేసుకొని త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. త్వరలొనే శ్రీను వైట్ల తన నెక్స్ట్ సినిమా అప్ డేట్ చెప్పి సీక్వెల్ క్యాన్సెల్ అయిందనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పే అవకాశం ఉంది.
This post was last modified on April 29, 2022 4:59 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…