రుసబెట్టి సినిమాలు చేస్తూ ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ లతో పాటు బాబీ దర్శకత్వంలో చేస్తున్న భారీ చిత్రంతో బాగా బిజీగా ఉన్నారు. వీటిలో మూడోదానికి టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో వాల్తేరు వీరయ్యగా చిరునే స్వయంగా లీక్ చేయడంతో ఇప్పుడది అఫీషియల్ కావడం ఒక్కటే మిగిలింది.
లీకులు ఇచ్చే విషయంలో ఆయన తొందరపాటు గురించి అందరికీ తెలిసిందే. అయినా రిపీట్ చేస్తూనే ఉంటారు. ఈ వీరయ్య టైటిల్ వెనుక ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన కథ ఉంది. చిరంజీవి ఇండస్ట్రీకి రాక ముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో దర్శక నిర్మాతలకు ఫోటోలు పంపేందుకు ఒక కెమెరా అవసరమయ్యింది.
తండ్రి వెంకట్రావు గారితో పాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొలీగ్ వీరయ్య ఈ విషయంలో సహాయం చేసి చిరంజీవిని అందంగా ఫోటోలు తీసి ఆయనే స్వయంగా మద్రాసుకు పంపేవారట. ఒక్కోసారి చిరుకి చెప్పకుండా నిర్మాణ సంస్థలకు పంపిన సందర్భాలు ఉన్నాయట.
అలా వీరయ్య తీసిన ఫోటోల ఆల్బమ్ పరిశ్రమకు కొత్తగా అడుగు పెట్టిన టైంలో చిరుకి చాలా ఉపయోగపడింది. ఒకవేళ వీరయ్య కనక లేకపోయి ఉంటే అంతబాగా తీసే కెమెరామెన్ ని వెతుక్కోవాల్సి వచ్చేది. అలా మెగాస్టార్ మనసులో ఆయన పట్ల ఆ కృతజ్ఞత అలా ఉండిపోయింది. బాబీ చెప్పిన మాస్ ఎంటర్ టైనర్ కథ వినగానే ఎలాగూ వైజాగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరైతే బాగుంటుందని చెప్పారట. అలా ఫిక్స్ అయ్యింది. ఇదంతా చిరు ఇంకా టెలికాస్ట్ కావాల్సిన ఓ సెలబ్రిటీ టాక్ షోలో పంచుకున్నారు
This post was last modified on April 29, 2022 3:19 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…