ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ ఇద్దరి మధ్య జరుగుతోంది. పూజ హెగ్డే, రష్మిక ఇద్దరూ నెంబర్ వన్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రష్మిక సరిలేరు నీకెవ్వరు, భీష్మ విజయాలతో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఆమె తదుపరి చిత్రం కూడా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతోనే చేస్తోంది.
మొదట్లో కుర్ర హీరోలతో నటించినా కానీ ఇప్పుడు రష్మిక రేంజ్ వేరు. తదుపరి సినిమాలు చేస్తే చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో చేస్తుంది. ఒకవేళ మధ్య శ్రేణి హీరోలతో చేసినా కానీ సోలో హీరోయిన్ అయితేనే చేయడం ఖచ్చితం. టాప్ హీరోలు పోటీ పడినా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్న రష్మిక ఒక మీడియం బడ్జెట్ సినిమాలో, నాని నటించే శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తుందని గాసిప్స్ పుట్టించారు.
సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించే చిత్రంలో రష్మిక ఎలా నటిస్తుంది. అది కూడా తనకు అత్యంత డిమాండ్ ఉన్న దశలో? ఇదంతా సదరు సినిమాకు హైప్ తేవడం కోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు.
This post was last modified on June 23, 2020 12:16 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…