Movie News

చిరు, చరణ్ ముందు మెగా టార్గెట్

సినీ రంగం నుంచి పదేళ్లు గ్యాప్ తీసుకున్నా తన పవర్ ఏమీ తగ్గలేదని ఐదేళ్ల ముందు చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ఆ సమయానికి నాన్ బాహుబలి రికార్డు బిజినెస్ చేసింది. వసూళ్ల పరంగా కూడా నాన్ బాహుబలి రికార్డును అందుకుంది. అప్పటికి బాహుబలి కాకుండా తొలి వంద కోట్ల షేర్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’నే కావడం విశేషం.

చిరు తర్వాతి సినిమా ‘సైరా’ కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడు ‘ఆచార్య’ సైతం బిజినెస్ పరంగా చిరు స్థాయిని ఇంకొంచెం పెంచిందే తప్ప తగ్గించలేదు. విపరీతంగా ఆలస్యమైనా.. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ లాంటి భారీ చిత్రాల సందడి తర్వాత కొంత మేర ప్రతికూల పరిస్థితుల్లో రిలీజవుతున్నా.. ‘ఆచార్య’కు బిజినెస్ మాత్రం ఒక రేంజిలోనే జరిగింది.

వరల్డ్ వైడ్ ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.140 కోట్లు కావడం గమనార్హం.చిరుతో కలిసి చరణ్ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న ‘ఆచార్య’ ముందు చాలా పెద్ద టార్గెట్ ఉన్నట్లే లెక్క. ఈ సగటు కమర్షియల్ చిత్రంతో రూ.140 కోట్ల టార్గెట్‌ను అందుకోవడం అంత తేలిక కాదు. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ స్థాయికి చేరువలో ఈ చిత్ర రైట్స్ అమ్ముడవడం విశేషం. నైజాం ఏరియాలో ‘ఆచార్య’ టార్గెట్ రూ.39 కోట్లు కాగా.. సీడెడ్‌లో రూ.20 కోట్లకు కాస్త ఎక్కువగానే షేర్ రాబట్టాల్సి ఉంది. ఆంధ్రా ప్రాంతంలో మిగతా ఏరియాలన్నీ కలిపి ‘ఆచార్య’ 55 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసింది.

కర్ణాటక హక్కులు రూ.9 కోట్లు పలికాయి. ఓవర్సీస్ హక్కులు రూ.11 కోట్లకు అమ్మారు. పబ్లిసిటీ, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఈ చిత్రం రూ.140 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ టార్గెట్‌ను అందుకోవాలంటే కేవలం వీకెండ్ వరకు సందడి చేస్తే సరిపోదు. రెండు వారాలైనా నిలకడగా వసూళ్లు రాబట్టాలి. కాబట్టి మెగా తండ్రీ కొడుకుల బాక్సాఫీస్ స్టామినాకు ఈ చిత్రం పెద్ద పరీక్ష కాబోతోందనడంలో సందేహం లేదు.

This post was last modified on April 28, 2022 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

2 hours ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

2 hours ago

హమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయి

కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్‌లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…

3 hours ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

4 hours ago

నేను సంబరాల రాంబాబునైతే…మరి పవన్?

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…

4 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

6 hours ago