ప్రస్తుతం బడా సినిమాలకు సంబంధించి ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్నీ మధ్య RRR టీం అనిల్ రావిపూడి తో ఓ ఇంటర్వ్యూ చేయించి బయటికి వదిలారు. ఆ ఇంటర్వ్యూ వైరల్ అయింది. అనిల్ టైమింగ్ తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ , ఫన్నీ గేమ్స్ ఇలా దానికి అన్ని కలిసొచ్చాయి. ఇక రాజమౌళితో సందీప్ రెడ్డి వంగా చేసిన ఇంటర్వ్యూ కూడా మూవీ లవర్స్ ఎట్రాక్ట్ చేసింది.
కంటెంట్ గురించి మాట్లాడిన ఆ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ కి ముందు బాగా క్లిక్ అయింది. ఇక అదే తరహాలో డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు ఆచార్య టీం. చిరు , చరణ్ , కొరటాల ముగ్గురితో హరీష్ శంకర్ ఆచార్య సెట్ లో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా నుండి ఓ డైలాగ్ లీక్ చేశారు చిరు.
కావాలనే చేసిందా ? అక్కడికక్కడ అనుకున్నాదా ? అనేది పక్కన పెడితే ఇంటర్వ్యూలో అది బాగా వైరల్ అయింది. అది కాకుండా ఇంటర్వ్యూలో పెద్ద కంటెంట్ లేదు. త్వరలోనే చిరు హరీష్ శంకర్ కి కూడా ఓ చాన్స్ ఇవ్వనున్నాడనేది ఆ ఇంటర్వ్యూ మొత్తానికి సారాంశంగా ఉంది. అయితే గతంలోనూ సైరా రిలీజ్ తర్వాత చిరు , చరణ్ లతో త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూ చేశారు.
అందులో త్రివిక్రమ్ భజన కార్యక్రమం తప్ప ఇంకేమి లేదు. అందులో చిరు కూడా వెంకీ , నాగర్జున వగైరా ప్రశంసలు గురించి చెప్పుకున్నారు తప్ప కంటెంట్ లేదు. RRR టీం అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ క్లిక్ అయిందని ‘ఆచార్య’ టీం హరీశ్ శంకర్ ని రంగంలో దింపితే సీన్ రివర్స్ అయింది. ఏదేమైనా మన టాలీవుడ్ డైరెక్టర్స్ యాంకర్స్ గా కనిపిస్తూ బడా సినిమాల ప్రమోషన్ భాద్యతను భుజాలపై వేసుకుంటున్నారు. వాళ్ళని వాడుకుంటూ మేకర్స్ పబ్లిసిటీలో కొత్త స్టాటజీ చూపిస్తున్నారు.
This post was last modified on April 28, 2022 5:01 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…