అజయ్ దేవగణ్ ఏదో అనుకున్నాడు. కానీ ఏదో జరిగిపోయింది. హైప్ లేని తన సినిమాకు ప్రమోషన్ కోసం చేశాడో.. లేక వేరే ఉద్దేశమో కానీ.. ఆయన వేసిన ట్వీట్ కారణంగా అనవసర వివాదంలో చిక్కుకుని ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇటీవల కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ హిందీ ఇంకెంత మాత్రం జాతీయ భాష కాదని, సౌత్ సినిమాలు ఉత్తరాదిన అదరగొడుతుంటే.. తెలుగు, తమిళంలోకి డబ్ అవుతున్న హిందీ సినిమాలు ఇక్కడ ప్రభావం చూపట్లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ వ్యాఖ్యలకు భలే కౌంటర్ ఇస్తున్నా అనుకుంటూ అజయ్ వేసిన ట్వీట్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. హిందీ జాతీయ భాష కాకుంటే మీ సినిమాలను హిందీలోకి ఎందుకు అనువాదం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ.. హిందీ మన మాతృభాష, మన జాతీయ భాష అని స్టేట్మెంట్ ఇచ్చాడు అజయ్. దీనికి సుదీప్ ఏం సమాధానం ఇచ్చాడు.. వీరి మధ్య తర్వాత జరిగిన సంభాషణ ఏంటన్నది పక్కన పెడితే.. సౌత్ ఇండియన్స్ ఈ ట్వీట్ మీద తీవ్రంగానే స్పందించారు. అందులో కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా ప్రముఖులు కూడా చాలామందే ఉన్నారు.
హిందీ అసలు జాతీయ భాష కాదు అనడానికి రుజువులు చూపిస్తూ.. హిందీ మీకు మాతృభాష కానీ, మాకు కాదు అంటూ అజయ్‌కి కౌంటర్లు ఇచ్చారు చాలామంది. ఇలా ఇంకెంత కాలం హిందీని మా మీద రుద్దుతారు.. ఏమిటి మీ ఆధిపత్యం అంటూ అజయ్‌ని కడిగిపారేస్తున్నారు సౌత్ నెటిజన్లు. అసలు అజయ్ హిందీలో ట్వీట్ వేయడాన్నే చాలామంది తప్పుబట్టారు. మీరు హిందీలో రాస్తే మేం అర్థం చేసుకుంటున్నాం, మరి మా భాషల్లో ట్వీట్లు వేస్తే మీకు అర్థమవుతుందా అన్న సుదీప్ ప్రశ్నను ఉటంకిస్తూ అజయ్‌ని చాలామంది నెటిజన్లు నిలదీశారు.
ఇంగ్లిష్ సినిమాలు ఇక్కడ అనువాదం అయి రిలీజవుతాయి.. మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పలు భాషల్లో అనువాదం అవుతాయి.. అంతమాత్రాన అవన్నీ మాతృభాషలు అవుతాయా.. మాతృభాషల్లో కాకుండా వేరే భాషల్లో సినిమాలు అనువాదం చేయకూడదా.. మరి మీరెదుకు వేరే భాషల్లోకి సినిమాలను అనువాదం చేస్తున్నారు అని నెటిజన్లు అజయ్‌కి ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి తన ట్వీట్‌తో అజయ్ దక్షిణాది జనాలతో బాగానే సున్నం పెట్టుకున్నాడు. ఇది అతడి సినిమాలకు చేటు చేసేదే.
This post was last modified on April 28, 2022 2:22 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…