‘అఖండ’ తర్వాత బాలయ్య , ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK107 నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు కానీ బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో గర్జించబోతున్నారనేది కన్ఫర్మ్.
అందులో ఓ కేరెక్టర్ నెగిటీవ్ గా ఉండబోతుందనేది ఇప్పుడు కొత్త అప్డేట్. అవును ఇందులో బాలయ్య ఓ నెగిటివ్ కేరెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. తాజాగా హైదరాబాద్ సారదీ స్టూడియోస్ లో ఆ పాత్ర తాలూకు సన్నివేశాలు తీశారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రకు చెల్లిగా కనిపించనుంది. ఆమె నిశ్చితార్థం సన్నివేశాలు నిన్న స్టూడియోలో తీశారు.
నవీన్ చంద్ర మరికొందరు నటీ నటులు పాల్గొన్నారు. ఇటివలే ‘అన్ స్టాపబుల్’ షో లో తనకి నెగటివ్ రోల్ చేయాలని ఉందని కానీ హీరోగా కూడా తనే ఉండాలని సరదాగా అన్నారు బాలయ్య. ఇప్పుడు గోపీచంద్ మలినేని కథ రూపంలో అదే నిజమవుతుంది. మరి బాలయ్య పూర్తి నెగిటివ్ గా కనిపిస్తారా ? జస్ట్ షేడ్స్ మాత్రమే ఉంటాయా ? తెలియాల్సి ఉంది.
నిజానికి ఈ సినిమాకు సంబంధించి బ్లాక్ డ్రెస్ లో బాలయ్య ఫస్ట్ లుక్ గా వదిలిన పాత్ర నెగిటివ్ కేరెక్టర్ లానే అనిపిస్తుంది. మరి మరో కేరెక్టర్ ఎలా ఉండబోతుందో ? ఆ కేరెక్టర్ లుక్ స్టైలిష్ గా ఉండనుందా ? అనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఏదేమైనా బాలయ్య సుల్తాన్ తర్వాత మళ్ళీ ఎట్టకేలకు ఓ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడన్న మాట.
This post was last modified on April 28, 2022 11:41 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…