Movie News

ఆషామాషీగా అంటే కుదరదు ఆచార్యా

ద‌శాబ్ద‌ విరామానికి తెర‌దించుతూ 2017లో ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ త‌ర్వాత రెండున్న‌రేళ్ల‌కు సైరా లాంటి భారీ చిత్రంతో ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ ఆ త‌ర్వాత అనుకోని విధంగా కెరీర్లో చాలా గ్యాప్ వ‌చ్చేసింది. క‌రోనా, ఇత‌ర కార‌ణాల‌తో ఆయ‌న కొత్త చిత్రం ఆచార్య చాలా ఆల‌స్యం అయి ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఐతే ఈ సినిమాకు రిలీజ్ టైమింగ్ అంత సానుకూలంగా అయితే క‌నిపించ‌డం లేదు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాక‌.. ఈ చిత్రం రిలీజ‌వుతోంది. మూడు వారాల వ్య‌వ‌ధిలో వ‌చ్చిన ఈ రెండు విజువ‌ల్ వండ‌ర్స్ కోసం ప్రేక్ష‌కులు బాగా ఖ‌ర్చు పెట్టుకున్నారు. అవి ఆడియ‌న్స్‌ను వేరే ప్ర‌పంచాల్లోకి తీసుకెళ్లాయి. విజువ‌ల్‌గా వారికి గొప్ప అనుభూతిని పంచాయి. దీంతో ఆచార్య కోసం ప్రేక్ష‌కులు మ‌రీ ఎగ‌బ‌డిపోవ‌ట్లేదు.

ఆచార్య‌కు ఉన్నంత‌లో బుకింగ్స్ బాగానే అనిపిస్తున్నాయి కానీ.. సూప‌ర్ అని మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ సినిమా కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ప్ర‌కారం చూస్తే ఇంకా జోష్ ఉండాలి. ఆచార్య జోరు కాస్త త‌గ్గ‌డానికి పై రెండు చిత్రాల ప్ర‌భావం ఓ కార‌ణం. ఐతే సినిమా చాలా ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల వ‌డ్డీల భారం బాగా ప‌డి ఆచార్య ఓవ‌రాల్ బ‌డ్జెట్ పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్లే భారీ రేట్ల‌కు సినిమాను అమ్మారు. ఇప్పుడు సినిమామీద మోయ‌లేనంత భారం ఉంది. అది రిక‌వ‌ర్ కావాలంటే సినిమాకు లాంగ్ ర‌న్ అవ‌స‌రం.

ఏదో వీకెండ్ వ‌ర‌కు దూకుడు చూపించి త‌ర్వాత డ్రాప్ అయితే క‌ష్టం. కాబ‌ట్టి సినిమాకు చాలా మంచి టాక్ రావాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే సినిమా రెండు వారాల పాటు నిల‌బ‌డుతుంది. క‌రోనా త‌ర్వాత ప్రేక్ష‌కులు అంత ఈజీగా థియేట‌ర్ల‌కు రావ‌ట్లేదు. యావ‌రేజ్ టాక్ వ‌స్తే ఫ్యామిలీస్ థియేట‌ర్ల‌కు క‌ద‌ల‌ట్లేదు. రిపీట్ ఆడియ‌న్స్ కూడా త‌గ్గిపోతున్నారు. కాబ‌ట్టి ఆచార్యకు అదిరిపోయే టాక్ రావాలి. క‌చ్చితంగా థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాల‌నిపించేలా ఈ సినిమా ఉండాలి. మ‌రి ఆచార్య అలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుందో లేదో చూడాలి.

This post was last modified on April 28, 2022 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

20 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago