ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు సక్సెస్ తో మంచి బోణీ చేసిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నాన్ స్టాప్ షూటింగ్ చేస్తూ రెగ్యులర్ గా ఫోటోల రూపంలో ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడం మాస్ కి కొంత అర్థం కాకపోయే రిస్క్ ఉన్నప్పటికీ ఈ సబ్జెక్టుకి ఇంతకన్నా బెటర్ ది సెట్ కాదని డైరెక్టర్ మాట.
ఫ్యాన్స్ మాత్రం దీని మీద బోలెడంత నమ్మకం పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే ఘోస్ట్ టైటిల్(ది లేకుండా) తో శాండల్ వుడ్ లో మరో సినిమా రూపొందుతోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది. త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే మనకేంటి సంబంధం అనుకుంటున్నారా. ఇది కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్టే.
మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇటీవలే హీరో పుట్టినరోజు సందర్భంగా వదలిన పోస్టర్ లో తెలుగు హిందీ తమిళంలో వస్తుందని స్పష్టంగా చెప్పేశారు. సో అంతా తెలిసే జరుగుతోందన్న మాట. నాగ్ ది ఘోస్ట్ నిర్మాతలు ఎలాగూ టైటిల్ ఇక్కడి ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసి ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు.
అలా లేదంటే మాత్రం చిక్కే. అయినా నెలల క్రితమే మొదలైన మన ఘోస్ట్ నిర్మాణంలో ఉందని తెలిసి కూడా కనీస అవగాహనా లేకుండా కన్నడ మేకర్స్ ఇలా టైటిల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. అన్నట్టు ఇది కూడా ఫక్తు గన్నులు బాంబులతో సాగే యాక్షన్ మూవీనే. కాకపోతే నాగార్జున ఘోస్టే చిత్రీకరణ పరంగా ముందంజలో ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ పరంగా రిలీజ్ కూడా ఫస్టే ఉండొచ్చు
This post was last modified on April 27, 2022 11:41 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…