ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఆచార్యలో అనుష్క ఉందనే వార్త సోషల్ మీడియాతో పాటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే తిరుగుతోంది. బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా నల్లపూసైన స్వీటీకి నిశ్శబ్దం ఫలితం గట్టి షాకే ఇచ్చింది. ఆ కారణమో మరొకటో తెలియదు కానీ ఎందరు దర్శకులు కలిసేందుకు ప్రయత్నించినా అంతగా ఆసక్తి చూపించలేదు.
ఫైనల్ గా నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టు ఓకే అయ్యింది కానీ దాని తాలూకు అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ కు వస్తే అనుష్క నిజంగానే ఆచార్యలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెకండ్ హాఫ్ లో కీలకమైన నక్సలైట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్, చిరంజీవిలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుందట.
ఇది నిజమో కాదో సినిమా చూశాకే తెలుస్తుంది కానీ ఇంత పర్టికులర్ గా పేరుతో సహా లీక్ అయ్యిందంటే వాస్తవమయ్యే ఛాన్సే ఎక్కువ. సైరాలో ఇలాగే తళుక్కున మెరిసిన స్వీటీ అందులో కాంబినేషన్ సీన్లు చేయలేదు. కేవలం నరసింహారెడ్డి పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు పరిమితమయ్యింది.
అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితం స్టాలిన్ లో ఒక ప్రత్యేక గీతంలో మెగాస్టార్ తో ఆడిపాడింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మెగా మూవీలో మూడో సారి కనిపించనుంది. పైకి బజ్ ఎక్కువ తక్కువ ఎంత ఉన్నా కొణిదెల మ్యాట్నీ టీమ్స్ మాత్రం రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కెజిఎఫ్ 2 సందడి తగ్గిపోయింది కాబట్టి ఆచార్యకు రెవిన్యూ పరంగా ఇప్పుడిది మంచి టైం. బాగానే ఉందన్న మాట వచ్చినా చాలు మినిమమ్ వంద కోట్లు ఖాయం
This post was last modified on %s = human-readable time difference 12:34 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…