మొత్తానికి ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆమె పాత్రను సినిమా నుంచి తీసేశారు. చిరు పాత్రకు హీరోయిన్ని పెట్టి రొమాన్స్ చేయించడం, పాటలు పెట్టడం వల్ల ఆ పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో, కాజల్ పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేకపోతున్నామనే కారణంతో తన క్యారెక్టర్ని తీసేయాల్సి వచ్చిందని దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.
ఐతే కాజల్ లేకపోయినా.. సినిమాలో గ్లామర్‌కేమీ లోటు లేదు. రామ్ చరణ్ సిద్ధ పాత్రకు జోడీగా నీలాంబరి క్యారెక్టర్లో పూజా హెగ్డే లాంటి ఫాంలో ఉన్న టాప్ హీరోయిన్ ఈ సినిమాలో నటించింది. వీళ్లిద్దరి మీదా ఒక పాట తీశారు. కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. మరోవైపు రెజీనా కసాండ్రా ఒక ఐటెం సాంగ్ చేసింది. చిరు పాత్రకు హీరోయిన్ని పెట్టడంలో ఇబ్బంది ఉన్నా.. ఈ పాత్రను ఒక ఐటెం సాంగ్‌లో ఇన్వాల్వ్ చేయడానికి కొరటాలకు అభ్యంతరం లేకపోయింది.
దీన్ని సినిమాలో ఎలా జస్టిఫై చేస్తారో చూడాలి. ఈ పాటలో రెజీనా హాట్ హాట్‌గా కనిపించనుందని ఇంతకుముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోతోనే అర్థమైపోయింది. ఇక లాహే లాహే పాటలో గ్లామర్‌కు లోటు ఉండదనే తెలుస్తోంది. సినిమాలో తన పాత్రను తీసేసినా.. ఈ పాట వరకు కాజల్ కూడా మెరవబోతోంది. ఆమె ఇంతకుముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే.
ఆ పాట చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. కాజల్ ఆ పాటలో కనిపించింది. ఇప్పుడు బలవంతంగా ఆమెను దాన్నుంచి కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదని కొరటాల అండ్ కో భావిస్తుండొచ్చు. ఈ పాటలో కాజల్ ఉంటుందా లేదా అని కొరటాలను అడిగితే.. సినిమాలో చూద్దురు కానీ అని సమాధానం దాటవేశాడు. కాబట్టి కాజల్ పని చేసినన్ని రోజులకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ మేరకు ఈ పాట వరకు తనను ఉపయోగించుకోబోతున్నట్లే. మొత్తంగా చూస్తే చిరుకు జోడీ లేదన్న మాటే కానీ.. ‘ఆచార్య’ సినిమాలో గ్లామర్‌కైతే లోటు లేనట్లే.
This post was last modified on April 26, 2022 12:25 pm
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…