మిర్చితో టాలీవుడ్లోకి దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ డెలివర్ చేయడంతో అతను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఆ క్రమంలోనే రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. వీరి కలయికలో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ సినిమాకు హడావుడిగా ప్రారంభోత్సవం జరపడం గుర్తుండే ఉంటుంది.
కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత కొరటాల.. మహేష్ బాబుతో శ్రీమంతుడు చేశాడు. అది తొలి సినిమాను మంచి ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ఆపై జనతా గ్యారేజ్, భరత్ అనే నేను కూడా మంచి విజయం సాధించాయి. అయితే రెండో సినిమాకు మిస్ అయిన హీరోతో చిరంజీవి సినిమా ఆచార్యలో ఒక ప్రత్యేక పాత్ర చేయించి.. చరణ్‌తో సినిమా చేయించడంతో వీరి కాంబినేషన్ కార్యరూపం దాల్చింది.
ఐతే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. కొరటాల చిరుతో సినిమా చేయడానికి రెడీ అయితే అందులోకి అనుకోకుండా చరణ్ రావడం కాదు.. చరణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమైతే ఊహించని విధంగా చిరు ఎంట్రీ ఇచ్చాడు. ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ ట్విస్టును స్వయంగా చిరునే రివీల్ చేశాడు. కొరటాల.. చరణ్‌తో సినిమా చేయాలని ఓ కథ సిద్ధం చేసుకుని తన దగ్గరికి వచ్చాడని, కానీ చరణ్ ఆర్ఆర్ఆర్‌కు కమిటై ఉండడంతో తనతో సినిమా చేయొచ్చు కదా అని అన్నానని చెప్పాడు.
అంతకంటే భాగ్యమా అని వెళ్లి మళ్లీ ఒక కథ సిద్ధం చేసుకుని తనను కలిశాడని.. అదే ఆచార్య అని, ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రకు చరణ్‌ను ఎంచుకున్నామని చిరు వెల్లడించాడు. మరి ఇదే నిజమైతే చరణ్ కోసం కొరటాల రెడీ చేసి ఇంకో కథ ఇప్పుడు హోల్డ్‌లో ఉందన్నమాట. మళ్లీ ఇద్దరికీ కుదిరినపుడు ఆ కథతో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదని భావించాలి.
This post was last modified on April 25, 2022 9:03 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…