అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం కాస్త పెద్ద స్థాయి సినిమాలకు ఒకప్పుడు కేక్ వాక్ అన్నట్లే ఉండేది కానీ.. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. అక్కడ మార్కెట్ పుంజుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు మళ్లీ అక్కడ మంచి వసూళ్లే వస్తున్నాయి. అలా అని ప్రతి సినిమాకూ వసూళ్ల వర్షం కురియట్లేదు. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం అక్కడ 2 మిలియన్ డాలర్లు కూడా రాబట్టలేకపోయింది.
అలాంటిది కేజీఎఫ్-2 అనే కన్నడ సినిమా తెలుగు వెర్షన్ యుఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుని ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు యుఎస్‌లో 2 మిలియన్ మార్కును దాటాయి కానీ.. ఓ అనువాద చిత్రం కేవలం తెలుగు వరకు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం తొలిసారి. ఇప్పటిదాకా తెలుగులోకి అనువాదమైన పరభాషా చిత్రాల్లో ఒక్క రజినీకాంత్ సినిమా 2.0 మాత్రమే యుఎస్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ఇంకే చిత్రం కూడా 2 మిలియన్ మార్కుకు చేరువగా కూడా వెళ్లలేదు. కేజీఎఫ్-2 తెలుగు వెర్షన్‌కు యుఎస్‌లో మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేశారు కానీ.. మరీ 2 మిలియన్ మార్క్ దాటేయడం అసాధారణమే. కేజీఎఫ్-2 కన్నడ వెర్షన్‌కు కూడా అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక కేజీఎఫ్-2 ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండడం విశేషం.
ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే ఇండియాలో రూ.300 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పటిదాకా ఇండియాలో హిందీ వరకు ఈ మైలురాయిని అందుకుంది బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే. ఆ సినిమా జోరు చూస్తుంటే హిందీ వరకే రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో బయ్యర్లకు అన్ని భాషల్లో మంచి లాభాలు అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 24, 2022 7:27 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…