మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటపుడు తడబడుతుంటాడు. స్వేచ్ఛగా మాట్లాడలేకపోతుంటాడు. మొక్కుబడిగా, షార్ట్‌గా స్పీచ్‌లు లాగించేస్తుంటాడు. ‘ఆర్ఆర్ఆర్’ సహా చాలా సినిమాల ఈవెంట్లలో చరణ్ ప్రసంగాలు అభిమానులను నిరాశకు గురి చేశాయి. కానీ ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అతను పది నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేశాడు.
స్పీచ్ చాలా ఆసక్తికరంగా సాగింది కూడా. చరణ్ ఇంత బాగా మాట్లాడగలడా.. అతడిలో ఇంత ఫ్లో ఉందా అనిపించేలా ప్రసంగం సాగడం విశేషం. తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ ఎన్నడూ లేని స్థాయిలో ఎమోషనల్ అవడం ఈ స్పీచ్‌లో ఒక హైలైట్ కాగా.. మధ్యలో వేదిక మీదికి దూసుకొచ్చిన అభిమానితో చరణ్ వ్యవహరించిన తీరు మరో హైలైట్.
కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు గమనిస్తే.. ఉన్నట్లుండి అభిమానులు వేదికల మీదికి దూసుకొచ్చేయడం.. హీరోలకు పాదాభివందనాలు చేసేయడం.. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని లాక్కెళ్లడం.. హీరో వారించడం.. ఇలాంటి దృశ్యాలు సర్వ సాధారణం అయిపోయాయి. మొదట్లో ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యపరిచేవి కానీ.. తర్వాత అదో ప్రహసనంలా తయారైంది. పీఆర్ టీం కావాలనే కొందరు కుర్రాళ్లను ఇలా సెట్ చేస్తుంటారని, హీరో క్రేజ్ గురించి అందరూ మాట్లాడుకోవడానికి ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ ఈవెంట్లో తాను మాట్లాడుతుండగా.. వేదిక పైకి వచ్చి పాదాభివందనం చేయబోయిన అభిమానితో చరణ్ అన్న మాటలు ఆసక్తి రేకెత్తించారు. ఇదంతా ఎవరు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారు అని చరణ్ పంచ్ విసరడం విశేషం. సెక్యూరిటీ సిబ్బంది ఆ కుర్రాడిని లాగేయబోతుంటే.. వాళ్లను ఆపి సెల్ఫీ తీసుకున్నాడు చరణ్. తర్వాత యధావిధిగా ప్రసంగం కొనసాగింది. ఐతే ఇలా సెట్ చేసి క్రేజ్ చూపించుకునే హీరోలకు చరణ్ పంచ్ ఇచ్చినట్లు.. అలాగే తన కోసం ఇలా ప్లాన్ చేసి ఉన్నా కూడా ఈ అతి అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లు అనిపించింది తన వాలకం చూస్తే.
This post was last modified on April 24, 2022 3:41 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…