చిరంజీవి గారి వల్లే ఇండస్ట్రీ బతికింది: నిర్మాత సవాల్

తెలుగు సినిమాకు ఇప్పుడు దాసరి లేని లోటు తీరుస్తున్నది చిరునే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీలో మరో వర్గం మాత్రం దీన్ని ఒప్పుకోలేకపోతున్నారు. దీని చాలానే కారణాలున్నాయి. చిరు తమని పక్కన పెట్టి ఇండస్ట్రీలో తానే ముందు అన్నట్టుగా సమస్యల చర్చకు వెళ్తున్నారని వారి అభిప్రాయం. అందుకే ఓ వేదికపై తను ఇండస్ట్రీ పెద్ద స్థానంలో లేనని కేవలం తనని సలహా కానీ , సాయం కానీ కోరుకుంటే ముందుంటానని తనకి పెద్ద అనే ట్యాగ్ అక్కర్లేదని చిరు చిన్నగా ఫైర్ అయ్యారు కూడా.

అయితే ఇప్పుడు ‘ఆచార్య’ వేదికగా మళ్ళీ ఈ విషయం చర్చ కొచ్చింది. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఉంటున్న ఎన్ వి ప్రసాద్ చిరు గొప్పదనం చెప్తూ మిగతా వారికీ సవాలు విసరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ బతికింది అంటే దానికి ఏకైక కారణం చిరంజీవి గారే. ఆయన ముందుండి ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని , ఆచార్యగా పెద్ద సినిమాలకు దారి ఇచ్చి డేట్స్ అడ్జస్ట్ చేయడంలో కూడా చిరంజీవి గారు ముఖ్య భూమిక పోషించారని వేదికగా మాట్లాడాడు ఎన్ వి ప్రసాద్.

ఎవరో ఎన్నో మాట్లాడతారు కానీ నా ముందుకొచ్చి మాట్లాడండి ఇది నా సవాల్ ఊరికే సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడటం కాదు అంటూ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో బాలకృష్ణ , మోహన్ బాబు తదితరులు చిరు పెద్దగా ఉంటూ చేస్తున్న పనుల గురించి సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తపరిచారు.

ఇది అందరికీ తెల్సిందే. మరి ఇప్పుడు ఎన్ వి ప్రసాద్ మాటలు చూస్తే వారితో పాటు చిరు గురించి నెగిటివ్ గా మాట్లాడిన అందరికీ చురకలు అంటించినట్టే అనిపిస్తుంది. ఏదేమైనా ఇండస్ట్రీ కి ఓ వ్యక్తి ద్వారా మంచి జరిగితే పెద్ద అనడంలో సందేహం లేదు. అందుకే ప్రస్తుతం రాజమౌళి నుండి ఎన్ వి ప్రసాద్ దాక అందరూ అదే చెప్తూ చిరుకి ఎట్టకేలకు దాసరి స్థానం కట్టబెట్టేశారు.