నాని ప్రధాన పాత్రలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన జెర్సీ మూవీని తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా చెప్పొచ్చు. కథాకథనాల పరంగా చూసినా.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ పరంగా చూసినా ఇదొక క్లాసిక్ అనడంలో సందేహం లేదు. ఏ భాషకు చెందిన ప్రేక్షకులనైనా ఆకట్టుకునే సార్వజనీనమైన కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రం చూసి తెగ నచ్చేసి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్‌కు రెడీ అయ్యాడు.
తెలుగు వెర్షన్ దర్శకుడు గౌతమ్‌నే రీమేక్‌కూ ఎంచుకున్నాడు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ నాగవంశీతో కలిసి దిల్ రాజు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు హిందీలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. సాధారణ ప్రేక్షకులు గొప్పగా చెబుతున్నారీ సినిమా గురించి. కానీ కేజీఎఫ్-2 జోరు వల్ల దీని వసూళ్లపై ప్రభావం కనిపిస్తోంది.
సమీక్షకుల్లో కూడా జెన్యూన్ రివ్యూలు ఇచ్చిన వాళ్లు సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడారు. మంచి రేటింగ్స్ ఇచ్చారు.
కానీ తరణ్ ఆదర్శ్ సహా కొందరు పేరున్న క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని డీగ్రేడ్ చేస్తున్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తరణ్‌కు పెయిడ్ క్రిటిక్ అనే ముద్ర ఉంది. ఆయన కొన్ని సినిమాలకు ఊహించని రేటింగ్స్ ఇస్తుంటారు. ఉదాహరణకు జాన్ అబ్రహాం సినిమా సత్యమేవ జయతే-2కు ఆయన 3.5 రేటింగ్ ఇచ్చి సినిమా సూపర్ అన్నారు. అదొక పెద్ద డిజాస్టర్ అయింది. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులు తిట్టిపోశారు.
అలాంటి సినిమాను మోసిన తరణ్.. జెర్సీ లాంటి మంచి చిత్రాన్ని డల్‌గా ఉందని, సెకండాఫ్‌లో క్రికెట్ ఎక్కువైందని కామెంట్లు చేయడం విడ్డూరం. దీనిపై ఆయనకు హిందీ ప్రేక్షకుల నుంచే కౌంటర్లు తప్పట్లేదు. క్రెడిబిలిటీ లేని రివ్యూయర్ అంటూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు. నార్త్ మార్కెట్లో తెలుగు కథలు, తెలుగు హీరోలు, తెలుగు దర్శకుల డామినేషన్ చూసి ఓర్వలేకే ఉద్దేశపూర్వకంగా తరణ్ లాంటి క్రిటిక్స్ జెర్సీని డీగ్రేడ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 23, 2022 6:37 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…