ఓ భారీ చిత్రం బరిలో ఉండగా.. అదే వీకెండ్లో ఓ చిన్న సినిమాను రిలీజ్ చేయడం అంటే సాహసమే. అందులోనూ కరోనా తర్వాత చిన్న సినిమాలకు థియేటర్లలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇలా చేయడం మరీ రిస్క్ అవుతుంది. అయినా సరే.. ధైర్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే అనుమానించాల్సిందే. ఈ నెలాఖర్లో ‘ఆచార్య’ రిలీజవుతుండగా.. దాని పోటీగా ముందు విశ్వక్సేన్ సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ను దించాలని చూశారు. ఆచార్య డేట్ 29 కాగా.. తర్వాతి రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ కొన్ని రోజులు హడావుడి చేశాక డేట్ మార్చేశారు. వారం ఆలస్యంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ముందు ఇచ్చిన డేట్ పబ్లిసిటీ కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రానికి పోటీగా చిన్న సినిమా అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది కదా. అందుకే ఇలా చేశారేమో అన్న డౌట్లు కొట్టాయి. విశ్వక్సేన్ సినిమా వ్యవహారం ముగిశాక ఇప్పుడు ఇంకో చిన్న సినిమా విషయంలో ఇదే జరిగింది.
మరో యువ కథానాయకుడు శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘భళా తందనాన’ను ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించడం తెలిసిందే. అంత భారీ చిత్రం రేసులో ఉండగా.. ఈ చిన్న సినిమా రిలీజ్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు. అందులో శ్రీ విష్ణు, దర్శకుడు చైతన్య దంతులూరిల కెరీర్‌లకు ఈ సినిమా చాలా కీలకం కావడంతో ఇంత రిస్క్ చేస్తున్నారేంటి అన్న సందేహాలు కలిగాయి.
కానీ ఈ హడావుడి అంతా ఒక్క రోజుకే పరిమితం అయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మరుసటి రోజే టీం యు టర్న్ తీసుకుంది. దర్శకుడు చైతన్య దంతులూరి తన ట్విట్టర్లో అకౌంట్లో… తమ చిత్రం 30న రావట్లేదని ప్రకటించారు. మరి అతడికి తెలియకుండానే నిర్మాతలు డేట్ ప్రకటించారా.. లేక పబ్లిసిటీ కోసమే ఇలా డేట్ ఇచ్చి ఇప్పుడు యుటర్న్ తీసుకున్నారా అన్నది తెలియడం లేదు. త్వరలోనే కొత్త డేట్ ప్రకటించబోతోందట ‘భళా తందనాన’ టీం.
This post was last modified on April 23, 2022 6:07 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…