ఇండియాలో బాహుబలి-2 తర్వాత ఆ స్థాయి అంచనాలతో విడుదలైన చిత్రం కేజీఎఫ్-2. మేకింగ్ దశలో ఉండగా ఏమో అనుకున్నారు కానీ.. రిలీజ్ ముంగిట దీనికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. కాబట్టే టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ వసూళ్ల మోత మోగించేసిందీ చిత్రం. ట్రేడ్ పండిట్ల అంచనాలను మించిపోయిన ఈ చిత్రం వారం రోజుల వ్యవధిలో వరల్డ్ వైడ్ ఏకంగా రూ.720 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం.
తొలి వారం వసూళ్లలో ‘బాహుబలి-2’ తర్వాతి స్థానం ‘కేజీఎఫ్-2’దే. రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఫస్ట్ వీక్ ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడం విశేషం. మిగతా అన్ని ఏరియాల్లో ‘ఆర్ఆర్ఆర్’దే ఆధిపత్యం కానీ.. హిందీ మార్కెట్లో ‘కేజీఎఫ్-2’ దాంతో పోలిస్తే అసాధారణమైన వసూళ్లు రాబట్టడంతో ఇది రాజమౌళి సినిమాను మించిపోయింది. ఇండియాలో ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఏడు రోజుల్లో ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ‘కేజీఎఫ్-2’ తెలుగు వెర్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వారం రోజుల్లో రూ.96 కోట్ల గ్రాస్ రూ.65 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
తెలుగులో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకు దగ్గరగా ఉంది. కర్ణాకటలో ఈ కన్నడ చిత్రం రూ.125 కోట్ల గ్రాస్.. రూ.75 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఇండియా వరకే ‘కేజీఎఫ్-2’ రూ.600 కోట్లకు చేరువగా గ్రాస్, రూ.310 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. విదేశాల్లో కూడా రాకీ భాయ్ వసూళ్ల మోత మామూలుగా లేదు. రూ.120 కోట్లకు పైగా గ్రాస్, రూ.60 కోట్ల దాకా షేర్ వచ్చింది.
మొత్తంగా వరల్డ్ తొలి వారంలో ఈ చిత్రం రూ.370 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. వరల్డ్ వైడ్ ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.330 కోట్లు. అంటే తొలి వారంలోనే ఓవరాల్‌గా రూ.40 కోట్ల లాభం వచ్చింది. ఈ సినిమా ఇంకో రెండు వారాలు మంచి వసూళ్లనే రాబట్టడం గ్యారెంటీ. ఫుల్ రన్లో రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం లాంఛనమే అనిపిస్తోంది. మరి చివరికి రాకీ బాయ్ ఎక్కడ ఆగుతాడో చూడాలి.
This post was last modified on April 22, 2022 1:37 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…