అల వైకుంఠపురములో చిత్రానికి విడుదలకు ముందు వరకు అనేక రిపేర్లు చేసారు. బన్నీ టీమ్ బాగా ఇన్వాల్వ్ అయి ఎడిటింగ్ లో కూడా జోక్యం చేసుకున్నట్టు చెప్పుకున్నారు. ఫైనల్ కట్ రెడీ అయ్యే వరకు సలహాలు సూచనలు పాటిస్తూనే ఉన్నారు.
కానీ పుష్ప చిత్రానికి మాత్రం బన్నీ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదట. స్క్రిప్ట్ లాక్ అయిపోయిన ఈ చిత్రానికి ఇంత గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ రీవిజిట్లు, కరెక్షన్లు లేవట. అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని, ఇక మళ్ళీ ముట్టుకోవాల్సిన పని లేదని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకోమని సుకుమార్ కి చెప్పేశాడట.
ఈ సినిమా పట్ల బన్నీ విశేషమైన నమ్మకంతో ఉన్నాడట. అందుకే ఇది పూర్తయ్యే వరకు వేరే ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు. ఈ గ్యాప్ లో వేరే కథలు కూడా వినడం లేదు. పుష్ప సినిమా పూర్తి చేసి ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాకే వేరే ఏదైనా అని తనను అప్రోచ్ అయ్యే వాళ్లతో చెబుతున్నాడట. హీరో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సుకుమార్ ఏ రేంజ్ కథ సిద్ధం చేసాడనేది మీరే ఊహించుకోండిక.
This post was last modified on June 22, 2020 10:28 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…