రామ్ గోపాల్ వర్మ సినిమాలు మరీ నాసిరకంగా తయారయ్యాయని.. ఆయన సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదని అందరికీ తెలుసు. ఇదే మాట వర్మ దగ్గర అంటే.. తాను తీసే ప్రతి సినిమా తనకు డబ్బులు తెచ్చి పెడుతోందని, వాటి విషయంలో తాను చాలా హ్యాపీ అని ఇటీవల స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ వర్మ సినిమాలను ప్రదర్శిస్తే థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో ఆయన చిత్రాలకు స్క్రీన్లే ఇవ్వట్లేదు ఎగ్జిబిటర్లు.
వర్మ కొత్త చిత్రం ‘మా ఇష్టం’ పరిస్థితి ఇదే. ఈ చిత్రాన్ని ఈ నెల 8నే రిలీజ్ చేయాలని చూశాడు వర్మ. కానీ థియేటర్లు దొరక్క వెనక్కి తగ్గాడు. ఇది లెస్బియన్ మూవీ కావడం వల్ల మల్టీప్లెక్సులు స్క్రీన్లు ఇవ్వలేదని, అందుకే వాయిదా అని చెప్పుకున్నాడు వర్మ. కానీ వాస్తవం ఏంటంటే.. వర్మ సినిమాలకు డిమాండ్ లేకపోవడం వల్లే థియేటర్లు దొరకట్లేదు.
దీన్ని వర్మ మరో రకంగా కవర్ చేయాలని చూస్తున్నాడు.ఆ సంగతలా వదిలేస్తే ‘మా ఇష్టం’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చాడు వర్మ. మే 6న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. మళ్లీ ప్రమోషన్లతో హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ‘ఆచార్య’ థియేటర్లలో ఉండగా.. ‘సర్కారు వారి పాట’ రాబోతుండగా.. మే 6న అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ లాంటి ఆసక్తికర చిత్రాలు రాబోతుండగా.. అసలేమాత్రం బజ్ లేని వర్మ సినిమాకు థియేటర్లు దొరుకుతాయా అన్నది సందేహమే.
ఈ చిత్రంలో హీరోయిన్లతో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేయించి, ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు పెట్టినా కూడా ప్రేక్షకులకు కనీస ఆసక్తి పుట్టట్లేదంటే వర్మ సినిమాలంటే ఎలాంటి వ్యతిరేక భావంతో ఉన్నారో అర్థమైపోతుంది. మరి ఈ సారి కూడా థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటే.. ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం తప్ప వర్మకు ఇంకో ఆప్షన్ లేదు.
This post was last modified on April 21, 2022 4:24 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…