మూడేళ్ళ క్రితం కేవలం కన్నడ సీమకే పరిమితమైన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు ప్యాన్ ఇండియా బ్యానర్ గా మారిపోయింది. కెజిఎఫ్ రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో వీళ్ళ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
శాండల్ వుడ్ స్టాండర్డ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంస్థగా దీనికి ప్రత్యేక గౌరవం దక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్న సలార్ కూడా సక్సెస్ అయితే హోంబాలే రేంజ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కష్టమే.
అలా అని అప్పటిదాకా వీళ్ళు ఆగడం లేదు. ఒక క్రేజీ కాంబినేషన్ తో కొత్త ప్రాజెక్టు ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
2020 కొరోనా టైంలో సూర్య హీరోగా రూపొందిన ఆకాశం నీ హద్దురా (తమిళం సూరారై పోట్రు)తో లెక్కలేనన్ని ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్న సుధా కొంగర దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి హోంబలీ ఫిలింస్ శ్రీకారం చుట్టనుంది. హీరో ఎవరనేది ఇంకా చెప్పలేదు కానీ సూర్యనే లాక్ అయ్యారని చెన్నై మీడియాలో లీకులు వచ్చాయి. ఇది కూడా గ్రాండ్ గా టైం చూసి అనౌన్స్ చేస్తారు.
ఆకాశం నీ హద్దురా దాదాపు ఆస్కార్ తెచ్చుకున్నంత పని చేశాక తర్వాత సినిమా కోసం సుధా కొంగర ముందు విజయ్ తో చేయాలని ట్రై చేశారు. కానీ కుదరలేదు. ఇప్పుడు హీరో కాంబో రిపీట్ అవుతున్నా బడ్జెట్ పరంగా రాజీ లేని నిర్మాతలు దొరకడంతో స్కేల్ ని ఊహించడం కష్టమే. రెగ్యులర్ ఎంటర్ టైనర్స్ కాకుండా గురు లాంటి ఎమోషనల్ డ్రామాలకే ప్రాధాన్యం ఇచ్చే సుధా కొంగర ఇప్పుడే జానర్ తీసుకున్నారో. ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రూ స్టోరీ అనే హింట్ ఇచ్చారు కాబట్టి ఏదో నిజ జీవిత కథనో సంఘటనో అయ్యుంటుంది.
This post was last modified on April 21, 2022 12:17 pm
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…