వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మీద అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రేంజ్ బజ్ అయితే లేదు కానీ టీమ్ మాత్రం ఫలితం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నిన్నటి నుంచి రామ్ చరణ్ కొరటాల శివ ఇంటర్వ్యూతో ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఈ నెల 23న హైదరాబాద్ యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తారనే లీక్ వదిలారు కానీ అదెంత వరకు నిజమో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.
ఇక అసలు విషయానికి వస్తే ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. టీమ్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ దర్శకుడు కొరటాల శివ ప్రతిపాదనకు ప్రిన్స్ వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. ఈ డబ్బింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను దర్శకుడిగా కొరటాల మీద మహేష్ కు అపారమైన అభిమానం. ఒక స్టేజిలో ట్రిపులార్ వల్ల రామ్ చరణ్ కనక ఆచార్య క్యారెక్టర్ చేయలేకపోతే తనను అడగమని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
సో ఆచార్యకు ప్రిన్స్ వాయిస్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేదే. గతంలో తన గొంతు ఇచ్చిన సినిమాలు పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా. రెండూ మంచి ఫలితాలు అందుకున్నాయి. కృష్ణ గారి శ్రీశ్రీ, మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చిందిలో కూడా తన వాయిస్ ఉంటుంది. సర్కారు వారి పాట విడుదల కోసం ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇదో స్వీట్ సర్ప్రైజ్. చిరు అంటే గౌరవం, చరణ్ తో స్నేహం, కొరటాల మీద అభిమానం ఇన్ని ఉంటే ఆయన నో ఎందుకు చెప్తారు.
This post was last modified on April 21, 2022 10:44 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…