ఏ సినిమాకు ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు హైప్ అసాధారణ స్థాయికి చేరుకుని బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతుంటాయి. మూడున్నరేళ్ల కిందట ‘కేజీఎఫ్’ అనే కన్నడ అనువాద చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అసాధారణ విజయాన్నందుకుంది. కన్నడలో మీడియం రేంజ్ హీరోను పెట్టి, ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు తీసిన చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఆ స్థాయిలో ఆడేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీఎఫ్-చాప్టర్ 2’కు ముందు నుంచి హైప్ ఉంది కానీ.. అది రిలీజ్ సమయానికి మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు విస్తుబోయారు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ చిత్రం సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు రోజుల తొలి వీకెండ్లోనే రూ.190 కోట్లకు పైగా కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆ తర్వాత కూడా ‘కేజీఎఫ్-2’ జోరు తగ్గలేదు.
సోమ, మంగళవారాల్లో కలిపి దాదాపు రూ.45 కోట్లకు పైగానే వసూళ్లు రావడం విశేషం. బుధవారం మ్యాట్నీలు అయ్యేసరికే ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ రూ.250 కోట్ల క్లబ్బులోకి అడుగు పెడుతోంది. ఇదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా రూ.250 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’కు రిలీజ్ ముంగిట హిందీలో పెద్దగా హైప్ కనిపించలేదు. దీంతో వంద కోట్లు వసూలు చేస్తే ఎక్కువ అన్నారు. కానీ రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. వసూళ్లు రోజు రోజుకూ పుంజుకున్నాయి.
100 కోట్లు, 200 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుతూ వచ్చింది. మంగళవారం నాటికి ఈ సినిమా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. ఐతే ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం ఇంత కష్టపడి, రిలీజైన నాలుగో వారంలో ఈ మార్కును అందుకుంటే.. ‘కేజీఎఫ్-2’ వారం తిరక్కముందే ఈ ఘనతను అందుకోవడం విశేషం. వీటి కంటే ముందు ‘కశ్మీర్ ఫైల్స్’ కరోనా తర్వాత హిందీలో రూ.250 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ‘కేజీఎఫ్-2’ ఊపు చూస్తే ఫుల్ రన్లో హిందీ వరకే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on April 20, 2022 2:59 pm
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…