ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ఒక కలల కాంబినేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. బాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్.. చాలా తక్కువ సినిమాలతో గొప్ప స్థాయిని అందుకున్న రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతున్నాడు. మున్నాబాయ్-1, 2.. 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ఇప్పటిదాకా తీసిన అయిదు చిత్రాలతోనూ ఘనవిజయాలందుకోవడంతో పాటు గొప్ప పేరూ సంపాదించిన హిరానితో షారుఖ్ సినిమా అనేసరికి హిందీ ఆడియన్సే కాదు.. మిగతా భాషల ప్రేక్షకులు కూడా అమితాసక్తితో చూస్తున్నారీ సినిమా కోసం.
సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే రిలీజ్ డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచిందీ చిత్ర బృందం. డంకి పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న విడుదల కాబోతోంది. హిరాని-షారుఖ్ కలయికలో సినిమా ఉంటుందని రెండేళ్ల ముందే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే విషయం ఒకటుంది. డంకి చిత్రానికి స్క్రిప్టు రాసింది కనిక థిల్లాన్ కావడం విశేషం. ఆమె రాఘవేంద్రరావు మాజీ కోడలన్న సంగతి గుర్తుండే ఉంటుంది.
కోవెలమూడి ప్రకాష్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌లోనే అతడితో కలిసుందామె. కనిక ముందు నుంచే బాలీవుడ్లో పేరున్న స్క్రీన్ రైటర్. తెలుగులో ప్రకాష్ తీసిన సైజ్ జీరో చిత్రానికి ఆమే కథకురాలు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత ఇద్దరికీ పొసగక విడాకులు తీసుకున్నారు.
తర్వాత కనిక తిరిగి ముంబయికి మకాం మార్చింది. ఆమె రచనలో గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో హసీన్ దిల్ రుబా అనే సినిమా వచ్చింది. అంతకుముందు షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన జీరోకు కూడా కనిక రైటర్. ట్రాక్ రికార్డు మరీ గొప్పగా ఏమీ లేకున్నా.. ఆమె అందించిన స్క్రిప్టుతో హిరాని సినిమా తీస్తుండటం విశేషమే. ఐతే దర్శకుడిగా ఆయన టచ్ ఎలాంటిదో తెలిసిందే కాబట్టి కనిక స్క్రిప్టు విషయంలో మరీ కంగారు పడాల్సిన పని లేదేమో.
This post was last modified on April 19, 2022 9:10 pm
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…