‘కేజీఎఫ్-2’ సినిమా వీకెండ్లో వసూళ్ల మోత మోగించింది. ఈ విషయంలో అందరి అంచనాలను ఆ సినిమా మించిపోయింది. నిజానికి ఈ చిత్రానికి పూర్తి పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. చాలామంది ‘కేజీఎఫ్-1’తో పోలిస్తే ‘కేజీఎఫ్-2’ ఏ రకంగా చూసినా తక్కువగా ఉందనే అంటున్నారు. రివ్యూలు యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. మౌత్ టాక్ మరీ గొప్పగా ఏమీ లేదు. ఎలివేషన్లు తప్ప ఎమోషన్ లేదని, ఇందులో అసలు కథేముందని పెదవి విరిచారు.
కానీ ఈ కామెంట్లేవీ కలెక్షన్ల మీద ప్రభావం చూపలేదు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం తొలి వారాంతంలో వసూళ్ల మోత మోగించింది. అటు హిందీలో, ఇటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాకు సరైన పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. హిందీలో ‘జెర్సీ’ సినిమా వాయిదా పడిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ‘బీస్ట్’ సినిమా తుస్సుమనిపించింది. ‘ఆర్ఆర్ఆర్’ జోరు ఆల్రెడీ తగ్గిపోయింది. దీంతో వారాంతంలో ‘కేజీఎఫ్-2’కు ఎదురు లేకపోయింది.
ఐతే విడుదల ముంగిట ఉన్న హైప్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందన్నది వాస్తవం. ‘కేజీఎఫ్’ చూసిన వాళ్లంతా చాప్టర్-2 కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. కాబట్టి ఆ హైప్‌లో సినిమా వసూళ్ల మోత మోగించింది. కానీ వీకెండ్ తర్వాత నిలవాలంటే సినిమాలో నిజంగా విషయం ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సోమవారం నుంచే థియేటర్లకు వస్తారు. రిపీట్ ఆడియన్స్ కూడా ఇప్పుడు కీలకం. మరి సినిమా వసూళ్లు సోమవారం నుంచి ఎలా ఉంటాయా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఐతే తెలుగు రాష్ట్రాల వరకు ‘కేజీఎఫ్-2’ దూకుడు వీకెండ్ తర్వాత బాగా తగ్గినట్లే కనిపిస్తోంది.
సోమవారం మామూలుగానే డ్రాప్ సహజమే కానీ.. కేజీఎఫ్-2కు కలెక్షన్ల డ్రాప్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వసూళ్లకు, సోమవారం వసూళ్లకు అసలు పోలికే లేదని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ఫైనల్ నంబర్స్ రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. ఐతే సోమవారం మార్నింగ్, మ్యాట్నీ షోలకు బాగా ఆక్యుపెన్సీ పడిపోయింది. ఐతే హిందీలో మాత్రం ‘కేజీఎఫ్-2’ దూకుడు కొనసాగుతోంది. అలాగే సౌత్‌లోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on April 19, 2022 3:18 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…