ఎప్పట్నుంచో డోలాయమానంలో ఉన్న ఒక సినిమాపై క్లారిటీ వచ్చేసినట్లే. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ అనుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఖుషి అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పులకింత కలుగుతుంది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఖుషి ఒకటి. ఇలాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ల టైటిళ్లను తిరిగి ఉపయోగిస్తున్నపుడు అభిమానులకు ఏదోలా అనిపించడం సహజం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను నాని సినిమాకు వాడుకున్నపుడు కూడా మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుషి అనే టైటిల్‌ను విజయ్ సినిమాకు వాడుకుంటున్నారన్న సమాచారం పట్ల కూడా అసంతృప్తే వ్యక్తమవుతోంది.
కాకపోతే ఇంకా ఈ టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ పేరే ఉంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఇక ఈ సినిమా విశేషాల విషయానికొస్తే.. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటించనుందట. వీళ్లిద్దరూ కలిసి ఇంతకుముందు మహానటిలో నటించడం తెలిసిందే. ఐతే అందులో విజయ్‌ది చిన్న క్యారెక్టరే. మరి ఫుల్ లెంగ్త్ జోడీగా విజయ్-సామ్ ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపికయ్యాడన్న న్యూస్ ఎగ్జైట్ చేసేదే.
అజ్ఞాతవాసితో తెలుగు ఎంట్రీలో చేదు అనుభవం ఎదుర్కొన్నాక అనిరుధ్ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. గ్యాంగ్ లీడర్, జెర్సీ లాంటి సినిమాలతో అతను తన ముద్రను చూపించాడు. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు కూడా అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్-శివ సినిమా ఎక్కువగా కశ్మీర్లో షూటింగ్ జరుపుకోనున్నట్లు, ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అన్నట్లు చెబుతున్నారు.
This post was last modified on April 18, 2022 10:57 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…